»   » టుడే రిలీజ్ 'బిందాస్' కధేంటి?

టుడే రిలీజ్ 'బిందాస్' కధేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్ హీరోగా రచయిత నుంచి దర్శకుడుగా మారిన వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందిన బిందాస్ చిత్రం ఈ రోజు(శుక్రవారం) రిలీజు అవుతోంది. ఈ చిత్రం కథ చిత్తూరు నేపధ్యంలో జరుగుతుంది. అక్కడ శేషాద్రి నాయుడు(శేషాద్రి నాయుడు), మహేద్ర నాయుడు(ఆహుతి ప్రసాద్) అనే ఇద్దరు ఫ్యాక్షన్ లీడర్స్ ఉంటారు. వీరద్దరి మధ్యా వార్ జరుగుతూంటుంది. అది బాగా హింసాత్మకంగా మారిపోవటంతో మహేంద్ర నాయుడు ఎవరికీ హాని కలగకూడదని తన వాళ్ళందరినీ తన ఇంటిలో పెట్టుకుంటాడు. అదే క్రమలో తమ రిలెటివ్ అయిన అజయ్(మనోజ్)ని కూడా ఆహ్వానిస్తారు. అయితే అక్కడ ఎవరికి అజయ్ రావటం ఇష్టం ఉండదు. ఎందుకంటే అతని తండ్రికి ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ లోగా అజయ్ తన మరదలు గిరిజ(షీనా)తో ప్రేమలో పడతాడు. ఈ లోగా ఇద్దరి నాయుళ్ళ మధ్యా ఇంకా గొడవలు పెరిగిపోతాయి.

అప్పుడు అజయ్ ఈ రెండు కుటుంబాల మధ్య పగ చల్లార్చి ఒక్కటి చేయాలనుకుంటాడు. అజయ్ ఏం ప్లాన్స్ వేసి ఇద్దరినీ కలపాడు...విజయం సాధించాడు అన్నది అజయ్ గాడి విజయ గాధగా మిగులుతుంది. ఈ చిత్రంలో మనోజ్ నటనే హైలెట్ అని చెప్తున్నారు. పక్కా మాస్ మసాలా సినిమా తీయాలని వీరూపోట్ల ప్రయత్నించాడు. అలాగే ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్నా ఇంటర్వెల్ వరకు వచ్చే సరికి కథ కుదుటపడి పరుగెడుతుంది. సెకెండాఫ్ లో ఎమ్.ఎస్.నారాయణ మీద వచ్చే కామిడీ ఎపిసోడ్...ఢీ, రెడీ రేంజిలో పేలుతుంది అని చెప్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మంచు మనోజ్‌, షీనా, బ్రహ్మానందం, సునీల్‌, రఘుబాబు, ఎమ్మెస్‌, జయప్రకాష్‌రెడ్డి, భరత్‌, వెన్నెల కిషోర్‌, విశ్వనాథ్‌ కాశీ, బెనర్జి, పృథ్వి, సుబ్బరాజు, సుప్రీత్‌, సంగీత, రజిత, జయలక్ష్మి, మాధవి తదితరులు నటించారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu