»   » బాషను కించపరిచారంటూ దిల్ రాజు, కేరింత హీరో‌పై దాడి

బాషను కించపరిచారంటూ దిల్ రాజు, కేరింత హీరో‌పై దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాకుళం: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం తన తాజా సినిమా ‘కేరింత' చిత్రం ప్రమోషన్లో బిజీగా గడుపుతున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన తన చిత్ర బృందంతో కలిసి శ్రీకాకుళం వెళ్లారు. అయితే అక్కడ చిత్ర యూనిట్ ఊహించని అనుభవం ఎదుర్కొంది. ఆయన కారుపై స్థానికులు కొందరు రాళ్లతో దాడి చేసారు.

Students attack on Kerintha movie unit

‘కేరింత' సినిమాలో తమ భాషను కించ పరిచేలా చిత్రీకరించారని స్థానిక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో దిల్ రాజు అక్కడి వారికి క్షమాపణలు చెప్పారు. అప్పటికీ శాంతించని విద్యార్థులు హీరో సుమంత్ అశ్విన్ మీద కోడిగుడ్లతో దాడి చేసారు. ఈ దాడి ఘటనపై పోలీసులు ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. ‘కేరింత' సినిమాలో నటుడు పార్వతీశం పోషించిన నూకరాజు పాత్ర శ్రీకాకుళం యాసతో సాగుతుంది. ఆ పాత్రను చిత్రీకరించిన తీరుపై స్థానికులు కొందరు ఆగ్రహంగా ఉన్నారు.


Students attack on Kerintha movie unit

సినిమా వివరాల్లోకి వెళితే..
దిల్ రాజు తాజా సినిమా ‘కేరింత' విడుదలైన తొలి వారం కలెక్షన్ల పరంగా నిరాశ పరిచినా... ఇపుడు కోలుకుంటోంది. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి, సుకృతి, పార్వతీశం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించారు.


నిమా విడుదలైనపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అపుడు కాస్త బాధగానే అనిపించింది. కానీ టాక్ బావుడటంతో రెండో వారంలో పుంజుకుంది. మంచి సినిమాకు ఆదరణ ఉంటుందని ఈ సినిమా నిరూపించింది. ఇప్పటి వరకు సినిమా ఏపీ, తెలంగాణల్లో రూ. 4 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల మరింత పెరుగతాయనే నమ్మకం ఉందన్నారు.

English summary
Students attacks on Kerintha movie unit at Srikakulam.
Please Wait while comments are loading...