For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాన్న తర్వాత నేను వచ్చాను తర్వాత నా కొడుకు వస్తాడు: బాలకృష్ణ ఉద్విగ్న ప్రసంగం

  |

  స్టంట్ మ్యాన్ హీరో సాహసాలని తాను చేసి హీరోని "హీరో" గా జనం ముందు నిలబెడతాడు. నిజానికి ఫైట్లు చేసే స్టంట్ మ్యాన్ల పేరు మాత్రం బయటి ప్ర పపంచానికి తెలియవు. దక్షిణ భారత సినీ, టీవీ స్టంట్‌ ఆర్టిస్టుల యూనియన్‌ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. యూనియన్‌ అధ్యక్షుడు అనలరసన్‌ నేతృత్వంలో సీనియర్‌ నటుడు శివకుమార్‌, ఆయన వారసులు సూర్య, కార్తీ చేతులచే జ్యోతిప్రజ్వలన చేయించి స్వర్ణోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా శివకుమార్‌ స్టంట్‌ యూనియన్‌కు రూ.10లక్షల విరాళం ప్రకటించారు. వేడుకల్లో భాగంగా సీనియర్‌ స్టంట్‌ ఆర్టిస్టులను మోహన్‌లాల్‌, బాలకృష్ణ, భాగ్యరాజా చేతుల మీదుగా సత్కరించారు.

  ఎన్ని ఫైట్లు ఉన్నాయని అడిగేవాడిని

  ఎన్ని ఫైట్లు ఉన్నాయని అడిగేవాడిని

  ఈ సందర్భంగా రజినీకాంత్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ‘చిన్న వయసులో నేను ఏదైనా సినిమా చూడాలనుకుంటే అందులో ఎన్ని ఫైట్లు ఉన్నాయని అడిగేవాడిని. ఇప్పుడు 67 ఏళ్ల వయసులోనూ ఎవరైనా కథ చెబితే ఎన్ని ఫైట్లు ఉన్నాయని అడుగుతుంటాను.

  చేతులెత్తి నమస్కరిస్తున్నాను

  చేతులెత్తి నమస్కరిస్తున్నాను

  నేనే ఈ స్థాయికి ఎదగడానికి దర్శకులు, నిర్మాతలు, సహ నటులు ఎంత తోడ్పడ్డారో, స్టంట్స్‌ ఆర్టిస్టుల సహకారమూ అంతే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అత్యధికంగా ఇష్టపడేది యాక్షన్‌ సినిమాలనే. కాసులు కురిపించేది కూడా అవే. ఇందుకు కారణమైన స్టంట్‌ కళాకారులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

  శరీరాన్ని పెట్టుబడిగా

  శరీరాన్ని పెట్టుబడిగా

  శరీరాన్ని పెట్టుబడిగా, ప్రాణాలను ఫణంగా పెట్టి సినిమా కోసం కష్టపడుతున్నారు. ‘మురట్టు కాలై'లో రైలు ఫైట్‌ అప్పట్లో ఒక సంచలనం. ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా, కేవలం ఒక పరుపు పెట్టుకుని ఆ ఫైటు తీశారు. ఇప్పుడు ‘యందిరన్‌', ‘2.0'ల్లో ఫారిన్‌ స్టంట్‌ ఆర్టిస్టులు ఎన్నో రక్షణ ఏర్పాట్లు, టెక్నాలజీతో సురక్షితంగా వారి వృత్తిని కొనసాగిస్తున్నారు.

  ప్రపంచంలోనే గొప్ప స్టంట్‌ కళాకారులు

  ప్రపంచంలోనే గొప్ప స్టంట్‌ కళాకారులు

  వాళ్లకిచ్చే సదుపాయాలన్నీ మనవాళ్లకీ ఇస్తే ప్రపంచంలోనే గొప్ప స్టంట్‌ కళాకారులుగా నిరూపించుకుంటారనడంలో సందేహం లేదు. ఎంజీఆర్‌ శత జయంత్యుత్సవాల్లో స్టంట్‌ యూనియన్‌ స్వర్ణోత్సవాలు జరుగడం మిక్కిలి సంతోషకరమైన విషయం. అంటూ ఉద్వేగంగా మాడాడు రజినీ.

  బాలకృష్ణ

  బాలకృష్ణ

  టాలీవుడ్ నుఇంచి హాజరైన బాలకృష్ణ లైవ్‌గా స్టంట్స్‌ చేసిన స్టంట్స్‌ ఈ వేడుకలకే హైలెట్‌గా నిలిచింది. ఈ వయసులోనూ ఆయన ఎనర్జీ చూసి ఆహూతులు ఆశ్చర్య పోయారు. ఆ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘స్టంట్‌ కళాకారులకు ఇది మర్చిపోలేని రోజు.

  25 ఏళ్ల క్రితం

  25 ఏళ్ల క్రితం

  ఈ రోజు నాక్కూడా మర్చిపో లేనిదే. 25 ఏళ్ల క్రితం స్టంట్‌ యూనియన్‌ రజతోత్సవ వేడుకలకు నాన్న ఎన్టీఆర్‌ వచ్చారు. 50ఏళ్ల వేడుకలకి నేను వచ్చాను. 75 ఏళ్ల వేడుకలకు నా కొడుకును, వందేళ్ల వేడుకలకు నా మనవడ్ని పంపిస్తాను. నేను పుట్టింది, పెరగింది చెన్నైలోనే.

  సినిమాకు భాష లేదు

  సినిమాకు భాష లేదు

  తమిళనాడు నీరు తాగి పెరిగిన శరీరం ఇది. నాన్న కూడా ఇదే మాట చెప్పేవారు. ఆ కృతజ్ఞతతోనే చెన్నైకి తెలుగుగంగని ఇచ్చారు. ఎందరో సీనియర్‌, జూనియర్‌ స్టంట్‌ ఆర్టిస్టులతో పనిచేశాను. స్టంట్‌ యూనియన్‌కు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాను. సినిమాకు భాష లేదు.' అన్నారు.

  English summary
  At the 50th year event, Superstar Rajinikanth, and Nandamuri Balakrishna had given a wonderful speeches that highlights the importance of the stunt department.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X