»   » పదిహేనేళ్లు కష్టపడి ఈ స్థితికి చేరుకున్నాను, ఆ విలువను అర్థం చేసుకోవాలి: అల్లు అర్జున్

పదిహేనేళ్లు కష్టపడి ఈ స్థితికి చేరుకున్నాను, ఆ విలువను అర్థం చేసుకోవాలి: అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ యానిమేషన్ లో కోర్స్ పూర్తిచేసి కెనడాలో ఫై చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ 'డాడీ' సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించి ఆకర్షించాడు. ఆ తరవాత అనూహ్యంగా వచ్చిన 'గంగోత్రి' (2003) సినిమాలో అవకాశంతో పూర్తిస్థాయి నటుడిగా మారాడు.

తెరంగేట్రం తేలికగానే జరిగింది

తెరంగేట్రం తేలికగానే జరిగింది

హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ తెరంగేట్రం తేలికగానే జరిగింది, కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎర్పరచుకోవటంలో అల్లు అర్జున్ కృషిని అభినందిచవలసిందే.


మలయాళంలో

మలయాళంలో

గంగోత్రి తరవాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య' గా యువత మనసులో స్థానం సంపాయించాడు. ఆర్య తో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం.


కమర్షియల్ హీరో

కమర్షియల్ హీరో

ఆ తరవాత రిలీజ్ అయిన 'బన్నీ' హిట్ తో హట్రిక్ పూర్తిచేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. మాస్ ఎంటర్‌టైనర్‌లకు పరిపూర్ణంగా న్యాయం చేయగల కథానాయకుల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో నిలుస్తాడు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు ఇలా ప్రతి సినిమాతో హీరోగా తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వస్తున్నడు స్టైలిష్ స్టార్.


ఎందుకలా?

ఎందుకలా?

అయితే గతకొంతకాలంగా రేసుగుర్రం, సరైనోడు ఇప్పుడు డీజే ఇలా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథాంశాలతో సినిమాలు చేస్తున్న అర్జున్. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రయోగాత్మక కథాంశాలకు దూరంగా ఉంటున్నాడు. ఎందుకలా? అన్న ప్రశ్నకి ఈ మధ్య ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా చెప్పాడు..


పరిమితులు ఏర్పడుతాయి

పరిమితులు ఏర్పడుతాయి

మార్కెట్ పరిధి పెరిగే కొద్ది పరిమితులు ఏర్పడుతాయి. వందకోట్ల మార్కెట్ ఉన్నప్పుడు ప్రయోగాలు చేయడం, ఐదు కోట్లలో సినిమా చేస్తే పది కోట్లు వస్తే చాలు అనుకోవడం సరికాదు. నేనున్న ప్రస్ధుత స్థాయికి చేరుకోవడానికి చాలా మంది నటులు అనేక కష్టాలు పడుతున్నారు.


పదిహేనేళ్లు కష్టపడి

పదిహేనేళ్లు కష్టపడి

పదిహేనేళ్లు ఎంతో కష్టపడి ఈ స్థితికి చేరుకున్నాను. ఆ విలువను అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో వెనక్కి వెళ్లి నేను ఎక్కడ నుంచి ప్రారంభమయ్యానో మళ్లీ అలాంటి సినిమాలే చేయడం సరికాదు. హెలికాప్టర్‌లో కూర్చొన్న తర్వాత మళ్లీ నేను బైక్ నడుపుతా అనుకుంటే ఎలా? అంటూ తన స్టాండ్ ఏమిటో చెప్పేసాడు..English summary
Stylish star Allu Arjun clarified Why he is doing Commercials entertainers and why leaved concept oriented subjects
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu