twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన అల్లు అర్జున్.. మిర్చి తర్వాత అలాంటి నిర్ణయం గ్రేట్

    |

    Recommended Video

    Allu Arjun Hails Prabhas In Recent Interview

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్‌ను రఫాడించేస్తున్నాడు. సంక్రాంతి బరిలో దూకిన ఈ చిత్రం రికార్డులను నెలకొల్పుతూ కాసుల పంటను పండిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు భారీ రికార్డులను తిరగరాస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్, త్రివిక్రమ్, అల్లు అరవింద్ సమాధానం ఇస్తూ..

    నా పర్ఫార్మెన్స్ గురించి

    నా పర్ఫార్మెన్స్ గురించి

    అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల వైకుంఠపురంలో సినిమా విడుదలైన మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారని నాకు అసలు తెలియదని స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అన్నారు. అది 100% త్రివిక్రమ్ గారు నా మీద వేసిన ట్రిక్. ఆయన ఒకటన్నారు.. 'మీకు తెలియకుండా మీతో బాగా చేయించాలని నేను ఫిక్స్ అయ్యాను' అని. నా పర్ఫామెన్స్ కి ఇంత అప్రిసియేషన్ వస్తుందని నా రిమోట్ ఇమేజినేషన్ లో కూడా లేదు. నేను త్రివిక్రమ్ గారి తో కూడా అన్నాను, 'ఏం సార్ నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను షాక్ లో ఉన్నాను' అని. నా చేత ఎలా చేయించారనేది ఆయన చెప్తారు. నాతో ఆయన చేయించారు. నేను ఏం చేశాను అని ఆలోచించే లోపే అందరూ అదిరిపోయింది అన్నారు. ఏం మాయ చేసారు సార్ మీరు? అని అల్లు అర్జున్ అడిగితే త్రివిక్రమ్ స్పందిస్తూ.. నాకే తెలియదు సార్ అని అన్నారు.

    బన్నీ నీ ఫీలింగ్ ఏంటి

    బన్నీ నీ ఫీలింగ్ ఏంటి

    అల్లు అరవింద్: సినిమా చూశాక 'బన్నీ నీ ఫీలింగ్ ఏంటి?' అని నేను అడిగాను. 'ఇది త్రివిక్రమ్ మాయ డాడీ' అని అన్నాడు.
    త్రివిక్రమ్: రుద్దినట్లు కాకుండా చాలా ఈజీగా చెప్పినట్లు ఉండాలని ట్రై చేశాను. కొన్ని సీన్లు ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలో కొన్ని పాయింట్లు పెట్టుకున్నాము. తను చేసిన ఇంటర్వెల్ సీను నాకు సంబంధించినంత వరకు ఒక రిఫరెన్స్ పాయింట్. ప్రతి షాట్ ఒక ఫిలిం లాగా ట్రీట్ చేశాం. నేను ఏదైతే ఒక గ్రాఫ్ అనుకున్నానో, ఆ గ్రాఫ్ పట్టుకొని తాను చేసుకుంటూ వెళ్ళాడు.

     ఈ గ్రాండ్ సక్సెస్ పై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?

    ఈ గ్రాండ్ సక్సెస్ పై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?

    త్రివిక్రమ్: నంబర్స్ అనేవి ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు కానీ, బన్నీకి కానీ అంకెల బదులు ఎంతమంది ఈ సినిమా చూశారా అనేది ఆనందాన్నిస్తుంది. ఎంతమందికి నచ్చింది అనే విషయం మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆర్టిస్ట్ అయిన కోరుకునేది తన మాట ఎక్కువమందికి వినిపించాలని, ఎక్కువ దూరం చేరాలని. నేనైతే దాన్ని అలాగే చూస్తాను. ఇది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అని మొదలు పెట్టినప్పుడే తెలుసు. దీన్ని ఎంత కాంటెంపరరీగా తీస్తామనేది అనేది ముందు నుంచి కాన్షియస్ గానే ఉన్న విషయం.

    పాజిటి్ ఎనర్జిని చూశాను

    పాజిటి్ ఎనర్జిని చూశాను

    అల్లు అర్జున్: త్రివిక్రమ్ గారు, నేను కలిసి చేస్తే ఉండే పాజిటివ్ ఎనర్జీ జనంలో చూశాను. మళ్లీ మేము కలిసి పనిచేస్తే ఆ ఆసక్తి అనేది ఉంటుందని అనిపించింది. నిజంగా హ్యాట్రిక్ అని అనుకోలేదు. మూడోదానికి రిథం సెట్ అయింది. బాల్ కనెక్ట్ అయి బౌండరీ దాటేసింది. ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు అనేది పెద్ద విషయం. ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసిందన్నప్పుడు మనం మరింత ఎక్స్పరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్ ఫిలిమ్స్ చేయొచ్చు.

    మీరు, ప్రభాస్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరి మధ్య దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా?

    మీరు, ప్రభాస్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరి మధ్య దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా?

    అల్లు అర్జున్: బాహుబలి గురించి నేను ఇప్పటివరకు మాట్లాడే అవకాశం రాలేదు. రాజమౌళి గారికి పర్సనల్ గా మాత్రం చెప్పాను. బాహుబలి మూవీతో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చినా కూడా అందుకు అతను అర్హుడు. మిర్చి లాంటి సినిమా తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించుకుని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి. అంతకాలం ఒక విషయం నమ్మి కూర్చున్నదానికి, అతను శాక్రిఫైజ్ చేసినదానికి ఎంత వచ్చినా కూడా దానికి అతను అర్హుడే.

    ప్రభాస్ స్టాచ్యూ పెట్టినందుకు హ్యాపీ

    ప్రభాస్ స్టాచ్యూ పెట్టినందుకు హ్యాపీ

    మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్ స్టాచ్యూ పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. ప్రభాస్ కు అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈరోజు మా రెండు సినిమాలు టాప్ టు ఫిలిమ్స్ అయినందుకు చాలా హ్యాపీ. రికార్డ్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ మనం కొట్టవచ్చు, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు.

     రికార్డ్స్ ని పక్కన పెడితే త్రివిక్రమ్ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి?

    రికార్డ్స్ ని పక్కన పెడితే త్రివిక్రమ్ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి?

    అల్లు అర్జున్: ప్రతి ఫిలింలో ఒక విషయం నేర్చుకున్నాను. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. మనం చేసే పనిపై ఓపెన్ గా, హానెస్ట్ గా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. డిటాచ్ అయ్యి అటాచ్ అవటం నేర్చుకున్నాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి అది కూడా ఒక కీలకమని నమ్ముతున్నాను.

    English summary
    Stylish Star Allu Arjun's Ala vaikunthapurramuloo making rampage at box office. Allu Arjun entered first time in Rs.100 crores club. Now its become industry hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X