»   » స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ ‘వరుడు’ అదరహో!

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ ‘వరుడు’ అదరహో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ 'వరుడు' గెటప్ లో ఎలా ఉండబోతున్నాడనే సస్పెన్స్ కు కొద్దికొద్దిగా దర్శక నిర్మాతలు తెర తీస్తున్నారు. ఈ చిత్ర కథాంశాన్ని కానీ, అల్లు అర్జున్ గెటప్ ను కానీ ఇంతవరకూ సీక్రెట్ గా ఉంచిన ఫిల్మ్ మేకర్స్ సమ్మర్ కానుకగా రిలీజ్ కు సిద్ధం చేస్తుండటంతో క్రమంగా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితమే 'వరుడు'లోగోను ఆవిష్కరించారు. నూతన వధూవరులు ముఖాలు చూపించకుండా పాణిగ్రహణం చేసినట్టు చూపించే డిజైన్ తో ఈ లోగో రూపొందించారు. తాజాగా 'వరుడు' ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులలో సంచలనం కలిగిస్తోంది. ఇందులో పెళ్లి పీటల మీద తలపాగ, షర్టు లేకపోవడం పట్టుబట్టలతో నుదిటికి బాసికం, తలకు పాగా చుట్టిన రాజవంశీకుడి తరహా గెటప్ లో అల్లు అర్జున్, ఆమెకు ఎదురుగా బుట్టలో కూర్చున్న వధువు కనిపిస్తారు. వధువు ముఖం ఇందులో కనిపించకుండా ఉంచటం మరో సస్పెన్స్.

టాలీవుడ్ తొలి సిక్స్ ప్యాక్ హీరో అల్లు అర్జున్ మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. 'దేశముదురు" కోసం కాయకష్టం చేసి ఆరు పలకల బాడీని సాధించిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం 'వరుడు" కోసం మరోసారి సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తున్నాడు. పైన పోటో చూస్తుంటే ఈ వరుడు ఏకంగా పెళ్లి పీటల మీద సిక్స్ ప్యాక్ తో వధువును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా కొత్తమ్మాయి నటిస్తోంది.

సినిమా చాలా బాగా వచ్చిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత డి.వి.వి.దానయ్య చెబుతున్నారు. అల్లు అర్జున్ అద్భుతమైన నటన ప్రదర్శించాడనీ, సినిమా రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరూ అతని నటన గురించి ముచ్చటించుకోవడం ఖాయమనీ గుణశేఖర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజజీవితంలోని 100 కుటుంబాలకు చెందిన వారిని ఇందులో నటింపజేయడం, అత్తున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తమిళ హీరో ఆర్య విలన్ పాత్ర పోషించగా, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ మరో కీలక పాత్ర పోషించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుందని, మార్చి 26న రిలీజ్ కు సిద్దం అవుతున్నట్లు సినిమా వర్గల సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu