»   » అల్లరి నరేష్ హీరోయిన్ జూ ఎన్టీఆర్ తో కమిటయ్యింది

అల్లరి నరేష్ హీరోయిన్ జూ ఎన్టీఆర్ తో కమిటయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్ తో సిద్దు ప్రమ్ శీకాకుళం, శుభప్రదం చిత్రాలు చేసిన మంజరి ఫెర్నాండెస్ తాజాగా ఎన్టీఆర్ చిత్రం కి సైన్ చేసింది. ఇలియానా హీరోయిన్ గా చేస్తోన్న శక్తి చిత్రంలో ఆమె సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. హిందీ, తెలుగు చిత్రాల్లో చేసినా స్టార్ డమ్ తెచ్చుకోని మంజరి...ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ అవుతానని భావిస్తోంది. ప్రస్తుతం శక్తి చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటి పూజా బేడీ ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. చిత్రంలో ఆమె ఓ ఈజెప్టు వనితగా దర్శనమివ్వనుంది. అలాగే జాకీష్రాఫ్, సూద్ విలన్స్ గా కనిపించనున్నారు. ఓ అడ్వంచరస్ ఫాంటసీగా రూపొందే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త గెటప్ లో కనిపించి ఫైట్స్ వంటివి విభిన్నంగా చేయనున్నాడని చెప్తున్నారు. వైజయింతి మూవీస్ పతాకంపై ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు కంత్రి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు అందిస్తూంటే, సమీర్ రెడ్డి కెమెరా, ఆనందసాయి ..కళ, ఎడిటింగ్..మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu