»   » అశ్లీల లీక్స్: మా ఆవిడ మానసిక స్థితి బాగోలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్!

అశ్లీల లీక్స్: మా ఆవిడ మానసిక స్థితి బాగోలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ సింగర్ సుచిత్ర కార్తీక ట్విట్టర్ పేజీ ద్వారా రెండు మూడు రోజులుగా సౌత్ సెలబ్రిటీలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు....ఇతర స్టార్లతో వారు చేస్తున్న రొమాన్స్ ఫోటోస్ లీక్ అవుతున్న సంగతి తెలిసిందే.

రజనీకాంత్ అల్లుడు ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సింగర్ చిన్మయి, రానా, త్రిష్, హన్సిక ఇంకా పలువురి ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇక హీరోయిన్ సంచితశెట్టికి సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అవ్వడం మరోసారి ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది.

మానసిక స్థితి బాగోలేకనే ఇదంతా?

ధనుష్ తో గొడవ తర్వాత సుచిత్ర కార్తిక్ పేజీ నుండి ఈ లీకులు కావడంతో ఆమె కావాలనే ఇదంతా చేస్తుందని అంతా అనుకుంటున్నారు. అయితే సుచిత్ర మాత్రం తనకు ఏ పాపం తెలియదని, తన అకౌంట్ హ్యాక్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా సుచిత్ర భర్త కార్తీక్ తన భార్య మానసిక స్థితి బాగోలేదని స్టేట్మెంట్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సెలబ్రిటీలు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలి

సెలబ్రిటీలు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలి

ఈ లీకుల పరిణామాలపై సుచిత్ర భర్త కార్తీక్‌ స్పందిస్తూ.... తన భార్య మానసిక స్థితి సరిగ్గాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు తగిన చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. ఎవరిపైనా తమకు విద్వేషం లేదని, లీకైన ఫోటోల్లోని సెలబ్రిటీలు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

 సుచిత్ర ఇంటిపై దాడి

సుచిత్ర ఇంటిపై దాడి

సెలబ్రిటీల ఫోటోలు వరుసగా లీకైన తర్వాత చెన్నైలోని సుచిత్ర ఇంటిపై శనివారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

హ్యాకింగ్ నిజంకాదా?

హ్యాకింగ్ నిజంకాదా?

సుచిత్ర భర్త తన భార్య గురించి ఇలా స్టేట్మెంట్ ఇవ్వడంతో....... సుచిత్ర మానసిక స్థితి బాగోలేకే ఇవన్నీ లీక్ చేసినట్లు అంతా భావిస్తున్నారు. తన అకౌంట్ హ్యాకింగుకు గురైనట్లు సుచిత్ర రెండు రోజుల క్రితం ఆమె చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని భావిస్తున్నారు.

English summary
Suchitra has been in the news for her recent tweets, mostly targeting actor Dhanush, radio jockey-turned-comedian RJ Balaji, singer Chinmayi and Vijay TV’s star host Dhivyadharshini. Suchitra’s husband and actor Karthik Kumar has issued a video where he explained the entire situation. “People have been mentioning her tweets in not so positive way. I have been honest enough to tel them, it is indicative of a certain emotional state we are all trying to understand and address,” he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu