»   » రజనీకాంత్‌‌తో వ్యవహారం కాబట్టే భయపడుతున్నాడు!

రజనీకాంత్‌‌తో వ్యవహారం కాబట్టే భయపడుతున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించాలని ఈ జనరేషన్ స్టార్స్ కోరుకోవడం సహజమే. ఎందుకంటే ఆయనతో నటిస్తే వచ్చే గుర్తింపు వారి కెరీర్‌కు బాగా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా తమిళనాడు బయటి హీరోలు తమిళనాడులో గుర్తింపు గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇదో మంచి మార్గం. అలాంటి వారిలో కన్నడ స్టార్ సుదీప్ ఒకరు.

ఇప్పటికే 'ఈగ' చిత్రంతో తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సుదీప్.... తన సినిమాల మార్కెట్‌ను ఇక్కడ క్రమక్రమంగా విస్తరిస్తున్నాడు. తమిళనాడులోనూ తన సినిమాల మార్కెట్ పెంచుకోవాలని ఎప్పటి నుండో ఆశ పడుతున్న సుదీప్...తన గురించి వార్తలు తనకు సంబంధం లేకుండా తమిళనాడులో ప్రచారంలోకి రావడంపై ఆందోళనకు గురవుతున్నాడు.

Sudeep clarified 'Lingaa' rumors

రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లింగా'. ఈ చిత్రంలో హీరో సుదీప్‌కు ఓ మంచి పాత్ర చేసే అవకాశం వచ్చిందని, అయితే ఈ ఆఫర్‌ను సుదీప్ తిరస్కరించాడని ఈ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రజనీకాంత్ సినిమా ఆఫర్‌కు సుదీప్ నో చెప్పాడనే విషయం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఇలాంటి వార్తలు తన కెరీర్‌ను దెబ్బతీస్తాయని భావించిన సుదీప్ విరవణ ఇచ్చారు. తనకు అసలు 'లింగా' చిత్రంలో నటించే అవకాశమే రాలేదని...తాను ఆఫర్ తిరస్కరించాననే వార్తల్లో నిజం లేదని సుదీప్ వివరణ ఇచ్చారు. రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని సుదీప్ స్పష్టం చేసారు.

English summary
Sudeep clarified about this rumor and said "The news that I refused Lingaa is a false news. Earlier, there was a rumor that a role was offered to me. I want to clarify that no such role had come my way". Infact Sudeep said that he is very much interested to be a part of Rajinikanth's films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu