»   » మరో షార్ట్ ఫిల్మ్ మేకర్ కు తెలుగు హీరో గ్రీన్ సిగ్నల్

మరో షార్ట్ ఫిల్మ్ మేకర్ కు తెలుగు హీరో గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షార్ట్ ఫిల్మ్ చేసి సినిమాలు డైరక్షన్ చేసే అవకాసాలు అందిపుచ్చుకుంటోంది యువత. ఇప్పటికే ఉయ్యాల జంపాల డైరక్టర్ విరించి, రన్ రాజా రన్ డైరక్టర్ సుజీత్, వెంకటాద్రి ఎక్సప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ తదితరులు సినిమా ఆఫర్స్ పొంది సక్సెస్ అయ్యారు. దాంతో హీరోలు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగ ఆదిత్యా శ్రీరామ్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్..దర్శకుడుగా అవకాసం పొందారని సమాచారం. సుధీర్ బాబు హీరోగా రూపొందనున్న చిత్రాన్ని ఆయన డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే లాంచ్ అయ్యింది. పంజాబి అమ్మాయి ని ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎంపిక చేసారు. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. 

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సుధీర్ బాబు తాజా చిత్రాల విషయానికి వస్తే...

'స్వామిరారా' మూవీకి... సీక్వెల్ ను తీస్తున్నారు చక్రి చిగురుపాటి! నటశేఖర కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు, నందిత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి 'మోసగాళ్ళకు మోసగాడు' అనే పేరు పెట్టారు. బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ లోగో, హీరో ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. కృష్ణ, విజయ నిర్మల దంపతులు దీనిని ఆవిష్కరించి, సుధీర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో వచ్చిన 'మోసగాళ్ళకు మోసగాడు' స్థాయి విజయాన్ని ఈ చిత్రమూ అందుకోవాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.

Sudeer Babu Next confirmed

అలాగే...

సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీష, శ్రీధర్‌ నిర్మించారు. హరి స్వరాలు సమకూర్చారు.

మహష్‌బాబు ఇప్పటి వరకు 'జల్సా', 'బాద్‌షా' చిత్రాల్లో తన గొంతునే వినిపించారు. తొలిసారి ఓ చిత్రంలో అతిధిగా అలరించనున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో మహేష్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర ప్రత్యేకంగా, ఆసక్తిగా ఉంటుంది. ఆయన కథ చెప్పగానే నటించడానికి అంగీకరించారు. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించడంలో సుధీర్‌బాబుది కీలక పాత్ర. మహేష్‌ అభిమానులకు నచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

నిర్మాత ల‌గ‌డ‌పాటి శిరీష శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ.... ఇప్పటి వ‌ర‌కు ఎన్నో ప్రేమ క‌థా చిత్రాలు వ‌చ్చాయి అయితే వాటి అన్నింటికి భిన్నంగా మేము ఓ సినిమాను రూపొందించాల‌ని త‌ల‌పెట్టాము.. దాని ఫ‌లిత‌మే ఈ కృష్ణమ్మ క‌లిపింది ఇద్దరినీ సినిమా .. ఈ సినిమాను పోల్చ వ‌ల‌సి వ‌స్తే గ‌తంలో తెలుగు లో వ‌చ్చిన మ‌రో చ‌రిత్ర హిందీలో వ‌చ్చిన ప్రేమ పావురాలు సినిమా స్థాయిలో ఉంటుంది. ఈ చిత్ర ద‌ర్శకుడు చంద్రు క‌న్నడంలో ఎంతో పేరు ఉన్న ద‌ర్శకుడు.. అత‌డు అక్కడ వ‌ర‌స విజ‌యాల‌ను అందించాడు.

ఈ చిత్రం సంగీతం గురించి చెప్ప వ‌ల‌సి వ‌స్తే ఆదిత్యా మ్యూజిక్ వారు మామూలు రేటు కంటే ప‌దంత‌లు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంగీతాన్ని వారు చేస్తేనే బాగుంటుంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శకుడు హ‌రి ఎ.ఆర్‌. రెహ‌మాన్ అంత‌టి స్థాయిలో సంగీతాన్ని అందించాడు అని వారు కొనియాడారు. ఈ సినిమా సంగీతం ప‌రంగా సినిమా ప‌రంగా ప్రేక్షకులను అల‌రిస్తుంద‌నే నమ్మకం మాకు ఉంది. మా బేన‌ర్ స్థాపించి ప‌దేండ్లు కావ‌స్తున్న సంద‌ర్భంగా ఈ సినిమా మంచి విజ‌యాన్ని సంపాదించి పెడుతుంద‌ని ఆశిస్తున్నాము అన్నారు.

సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన ‘చార్మినార్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఈ చిత్రాన్ని చూసిన తొలిచూపులోనే ఇష్టపడి చిత్రాన్ని నిర్మించాలనుకున్నానని, ప్రేమకథాచిత్రమ్‌తో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరితో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో చక్కని ప్రేమకథ ఉందని, తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.

దర్శకుడు కథ చెప్పిన తీరు నచ్చడంతో తానీ చిత్రాన్ని ఒప్పుకున్నానని, సినిమా ప్రతీ ప్రేక్షకుడికి నచ్చుతుందని, ప్రతిఒక్కరూ ఈ సినిమా చూసి తమ పాత రోజులు గుర్తుచేసుకుంటారని హీరో సుధీర్‌బాబు తెలిపారు.

కన్నడంలో పెద్ద చిత్రాలమధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిందని, కథకు తగిన విధంగా పేరును కూడా నిర్ణయించామని దర్శకుడు చంద్రు అన్నారు.

గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, సారికా రామచంద్రరావు, చిట్టిబాబు, అభిజిత్, కిషోర్‌దాస్, ఆశాలత, ప్రగతి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్న చిత్రానికి మాటలు: ఖధీర్‌బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా:కె.ఎస్.చంద్రశేఖర్, సంగీతం: హరి, నిర్మాత: శిరీషా శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.చంద్రు.

English summary
Sudheer babu next movie with Sriram Adithya, who is popular on YouTube, with several of his short films doing very well.
Please Wait while comments are loading...