»   » మహేష్‌కీ నచ్చడం ఆనందంగా ఉంది

మహేష్‌కీ నచ్చడం ఆనందంగా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''నటుడిగా పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన చిత్రమిది. మా ప్రయత్నం మహేష్‌కీ నచ్చడం మరింత ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఎన్ని విజయాలొచ్చినా 'కృష్ణమ్మ..'ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొంటా'' అంటున్నారు సుధీర్‌బాబు. ఈ చిత్రం గురించి మహేష్ రీసెంట్ గా ట్వీట్ చేసారు. తనకు బాగా నచ్చిన చిత్రం అని ఆయన అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ నిర్మించిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. సుధీర్‌బాబు, నందిత జంటగా నటించారు. చంద్రు దర్శకుడు. ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇలా మాట్లాడారు.

నిర్మాత మాట్లాడుతూ...''ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయడమే.. ముఖ్యం. మేమంతా కష్టపడి, నిజాయతీతో ఓ మంచి ప్రయత్నం చేశాం. దాన్ని ప్రేక్షకులు ఆదరించడం కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది''అన్నారు

అలాగే... ''ప్రేమ విలువను చాటి చెప్పిన చిత్రమిది. కెరీర్‌ ముఖ్యమా? ప్రేమ ముఖ్యమా? అని ప్రశ్నించుకొనే యువతరానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాం. మహేష్‌బాబు ఈ సినిమాని చూసి మెచ్చుకొన్నార''న్నారు. ఈ కార్యక్రమంలో ఖదీర్‌బాబు, సంగీత దర్శకుడు హరిగౌడ, లోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Sudheer Babu happy with Krishnamma Kalipindi result

చిత్రం కథేమిటంటే...

కన్నడలో విజయంతమైన 'చార్‌మినార్‌'కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం కథలో .... యుస్ ఎ లో ఓ పెద్ద కంపెనీకి సీఇఓగా పనిచేసే కృష్ణ (సుధీర్ బాబు), తాను చదివిన స్కూల్‌ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురం(ఇలాంటి పేర్లు మన సినిమాల్లో ఈ మధ్యన ఎవరూ పెట్టడం లేదు...మళ్లీ గుర్తు చేసారు ఆ రోజులని ) కి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. హైదరాబాద్ లో దిగి కృష్ణాపురంకి జర్నీ మొదలవ్వగానే కృష్ణకు తన గతం గుర్తు వస్తుంది.

తను ఎదుగదలకు కారణమై...తను ఎంతగానో ఇష్టపడ్డ రాధ (నందిత) చుట్టూ తిరుగుతుంది. లోయిర్ క్లాస్ లో పుట్టి ఆర్దికంగా ఇబ్బందులు పడుతూ ఏడవ తరగతి కూడా పాస్ కాలేని...తను ఇంజినీరు గా మారి ఆర్దికంగా ఉన్నత స్దాయికి ఎలా ఎదిగాడు..అందుకు ఆమె ప్రేమ ఎలా స్పూర్తిగా నిలిచింది. ఆమె ప్రేమను వ్యక్తం చేసే ప్రతీ సారి అతను పడే ఇబ్బందులు ఏమిటి...చివరకు... అతను ఆమె ప్రేమను పొందాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక చిత్రానికి.. రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందంటున్నారు నిర్మాతలు శిరీష, శ్రీధర్. గతవారం విడుదలైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో.. మరో 24 థియేటర్స్ ని పెంచారట.

English summary
Sudheer Babu and Nanditha scored a big hit with Prema Katha Chitram earlier. The hit pair has now wrapped up another film titled Krishnamma Kalipindi Iddarini. Directed by Chandru, the film is remake of a Kannada super hit movie released today with good talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu