»   » సుధీర్ బాబు సినిమా కు అవార్డ్ ...ఫుల్ హ్యాపీ

సుధీర్ బాబు సినిమా కు అవార్డ్ ...ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుధీర్‌ బాబు, నందిత జంటగా విజయం సాదించిన సినిమా‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ఈ సినిమాకు డైరక్టర్ చంద్రు. ఈ సినిమాకి జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నుంచి ఉత్తమ రొమాంటిక్‌ చిత్ర అవార్డు లభించింది.

దీనికి సంబందించి దాసరి నారాయణరావు సినిమా యునిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. దీనిని తెలుపుతూ హీరో సుధీర్‌ బాబు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దాసరి నారాయణరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబందించిన పోస్ట్ ఇక్కడ చూడండి.


Thank u Dasari Narayana Rao Garu for appreciating the entire team of #KrishnammaKalipindiIddarini for winning Best Romantic Film in Jaipur International Film Festival #JIFF Awards


Posted by Sudheer Babu on Saturday, January 9, 2016

‘‘ఒకప్పుడు ప్రేమకథల్లో ప్రేమ మాత్రమే ఉండేది. అప్పుడు ‘మరోచరిత్ర', ‘మజ్ను' లాంటి గొప్ప చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ప్రేమకథా చిత్రాల స్వరూపమే మారిపోయింది. ప్రేమ పేరుతో కామం చూపిస్తున్నారు. ఆ సమయంలో‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది''అన్నారు దాసరి నారాయణరావు.


సుధీర్‌బాబు, నందిత నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' జైపూర్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ రొమాంటిక్‌ చిత్రంగా పురస్కారం అందుకొంది. శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందాన్ని దాసరి అభినందించారు.


‘‘లగడపాటి శ్రీధర్‌ అభిరుచి ఉన్న నిర్మాత. ఎప్పుడు కలిసినా సినిమాల గురించే మాట్లాడతాడు. ఈ సినిమా నాకు చూపించినప్పుడు ‘తప్పకుండా మంచి చిత్రం అవుతుంది'అని అభినందించా. ఇప్పుడు పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది''అన్నారు దాసరి.


‘‘ఈ సినిమా స్ఫూర్తితో ఇకమీదటా ఉత్తమ కథా చిత్రాలే నిర్మిస్తాము''అన్నారు లగడపాటి శ్రీధర్‌.


Sudheer babu Krishnamma kalipindi iddarini get award

కన్నడలో విజయంతమైన 'చార్‌మినార్‌'కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం కథలో .... యుస్ ఎ లో ఓ పెద్ద కంపెనీకి సీఇఓగా పనిచేసే కృష్ణ (సుధీర్ బాబు), తాను చదివిన స్కూల్‌ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురం(ఇలాంటి పేర్లు మన సినిమాల్లో ఈ మధ్యన ఎవరూ పెట్టడం లేదు...మళ్లీ గుర్తు చేసారు ఆ రోజులని ) కి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది.


హైదరాబాద్ లో దిగి కృష్ణాపురంకి జర్నీ మొదలవ్వగానే కృష్ణకు తన గతం గుర్తు వస్తుంది. తను ఎదుగదలకు కారణమై...తను ఎంతగానో ఇష్టపడ్డ రాధ (నందిత) చుట్టూ తిరుగుతుంది. లోయిర్ క్లాస్ లో పుట్టి ఆర్దికంగా ఇబ్బందులు పడుతూ ఏడవ తరగతి కూడా పాస్ కాలేని...తను ఇంజినీరు గా మారి ఆర్దికంగా ఉన్నత స్దాయికి ఎలా ఎదిగాడు..అందుకు ఆమె ప్రేమ ఎలా స్పూర్తిగా నిలిచింది. ఆమె ప్రేమను వ్యక్తం చేసే ప్రతీ సారి అతను పడే ఇబ్బందులు ఏమిటి...చివరకు... అతను ఆమె ప్రేమను పొందాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

English summary
Sudheer babu and Nanditha film Krishnamma Kalipindi Iddarini get award from 'Jaipur internation film festival'. It is Directed by Chandru
Please Wait while comments are loading...