»   » జైలులో సుధీర్ బాబు, దర్శకుడు

జైలులో సుధీర్ బాబు, దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో సుధీర్ బాబుని, డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య ని, నటుడు జబర్దస్త్ వేణు ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఎంటీ వీళ్లేం తప్పు చేసారనుకుంటున్నారా.. అలాంటిదేం లేదు , ఇది కేవలం అనాథ పిల్లలు న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎఫ్‌ఎం రేడియో మిర్చి తో కలిసి కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌లో 'ఫండ్ రైజింగ్' కార్యక్రమాన్ని ఇలా వినుత్నంగా నిర్వహించారు.

రెండు రోజుల క్రితం విడుదలైన భలే మంచి రోజు చిత్రం హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమేషన్స్ వేగం పెచంచారు. అందులో భాగంగా ఈ జైలు డ్రామా ఏర్పాటు చేసారు.

Sudheer babu in Manjeer Mall

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జైలు సెట్‌లో ఆర్‌జే సమీర్ బందీ అయ్యారు. దీనికి ఎంతోకొంత ఉపయెగపడలని తమ వంతు సహకారంగా 'భలే మంచి రోజు' సినిమా యునిట్ సబ్యులు సుధీర్‌బాబు, శ్రీరామ్ ఆదిత్య, వేణు కలిసి మంజీరా మాల్‌కు వచ్చారు.

జైలు సెట్‌లో తమను తాము బంధించుకుని, అనాథ పిల్లలకు అవసరమయ్యే ఫండ్ వచ్చే వరకూ బందీలుగానే ఉన్నారు. 'ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించి, మానవత్వాన్ని చాటుకోవాల'ని సుధీర్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జే హేమంత్, ప్రోగ్రామింగ్ హెడ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

English summary
Sudheer Babu's Bhale Manchi Roju team Radio Mirchi Free their Dreams Fundraising Event at Manjeera Mall.
Please Wait while comments are loading...