»   » మహేష్ డైలాగుతో సుధీర్ బాబు చిత్రం టైటిల్

మహేష్ డైలాగుతో సుధీర్ బాబు చిత్రం టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం అతడులో 'ఆడు మగాడురా బుజ్జీ' అనే డైలాగు చాలా పాపులర్. ఇప్పుడా డైలాగుతో ఓ చిత్రం రాబోతోంది. మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఈ టైటిల్ ని పెట్టారని సమాచారం. ఈ చిత్రంతో రాజమౌళి గారి శిష్యుడు ఆర్కే దర్శకుడుగా మారుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైందని తెలుస్తోంది.

ఇక సుధీర్ బాబు హీరోగా మరో చిత్రం విడుదలకు సిద్దమైంది. సుధీర్‌ బాబు, నందిత జంటగా నటించిన సినిమా 'ప్రేమకథా చిత్రమ్‌'. జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి నిర్మాత. దర్శకుడు మారుతి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. షూటింగ్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ''మంచి నటీనటులు కుదిరారు. ప్రతి సన్నివేశం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సుధీర్‌, నందిత తెరపై చేసే సందడి ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది''అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ ''ఇదివరకు నేను చేసిన 'ఎస్‌.ఎమ్‌.ఎస్‌' చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే సంభాషణలు చెప్పే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని కొందరు సూచించారు. మహేష్‌బాబు కూడా అదే చెప్పారు. నన్ను నేను మార్చుకొని ఈ సినిమాలో నటించాను. తప్పకుండా ఇదొక మంచి చిత్రమవుతుంది''అన్నారు. ''ఇందులో నటించడం ఓ చక్కటి అనుభవం'' అన్నారు నందిత.

ఎ.రమేష్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ''మా నాన్నగారు ఎల్వీప్రసాద్‌ ఎన్నో కష్టాల్ని అధిగమించి ఈ రంగంలో ఎదిగారు. సినిమాపై ఉన్న భక్తిభావమే ఆయన్ని ముందుకు నడిపించింది. అదే తరహా తపన ఈ చిత్రబృందంలో కనిపిస్తోంది. ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి''అన్నారు. ''ఏప్రిల్‌ 14న పాటల్ని, మే 10న సినిమాని విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో డార్లింగ్‌ స్వామి, జె.బి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'పచ్చని కాపురం'లోని 'వెన్నెలైనా చీకటైనా నీతోనే జీవితమూ' ఎంత సూపర్ హిట్టో తెలిసిందే. ఇప్పుడు ఆ పాటని రీమిక్స్‌ చేస్తున్నారు. 'ఒక ప్రేమకథా చిత్రమ్‌' కోసం ఈ పాట మరోసారి తెరకెక్కి అలరించనుంది. ప్రవీణ్, హాసిక, రణధీర్, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: జె.బి., కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాతలు: ఆర్. ఆయుష్‌ రెడ్డి, ఆర్.పి. అక్షిత్‌రెడ్డి, ఛాయాగ్రహణం, దర్శకత్వం: జె. ప్రభాకరరెడ్డి.

English summary
Sudheer Babu's new film titled as 'Aadu Magaaduraa Bujjee'. Top director S S Rajamouli's former associate RK is to be introduced as director. Director R K worked with Rajamouli from Simhadri to Yamadonga.
Please Wait while comments are loading...