»   » వివరణ : నేను చేస్తున్నా...మహేష్ బాబు కాదు

వివరణ : నేను చేస్తున్నా...మహేష్ బాబు కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sudheer babu to play Pullela Gopichand
హైదరాబాద్ : మహేష్ త్వరలో పుల్లెల గోపిచంద్ పాత్రలో కనిపించనున్నాడనే వార్త మీడియాలో అంతటా స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని మహేష్ చెల్లెలు భర్త అయిన హీరో సుధీర్ బాబు నిర్మించనున్నాడని,ప్రవీణ్ సత్తారు ఈ సినిమా డైరక్ట్ చేస్తాడని చెప్పుకున్నారు. దాంతో మహేష్ అభిమానులు కంగారు పడ్డారు. కమర్షియల్ బాటని వదిలేసి తమ హీరో ఇలా బయోపిక్ ల వెంటపడటమేంటని డిస్కస్ చేసుకున్నారు. అయితే ఆ వార్త రూమరే అని సుధీర్ బాబు తేల్చి చెప్పారు. తనే ఆ పాత్ర చేయబోతున్నట్లు వివరించారు. ఈ మేరకు ప్రవీణ్ సత్తారు తో డిస్కస్ చేస్తున్నట్లు చెప్పారు. అంటే సుధీర్ బాబు న్యూస్ ని మహేష్ కు ఆపాదించి ప్రచారం చేసారన్నమాట.

ఇక సుధీర్‌బాబు, నందిత జంటగా నటిస్తున్న చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'. కన్నడంలో విజయవంతమైన 'చార్మినార్‌'కిది రీమేక్‌. మాతృకను తెరకెక్కించిన ఆర్‌.చంద్రునే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శిరీషా శ్రీధర్‌ నిర్మాతలు.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ ''ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ వినోద ప్రధానమైనవే. ఈ సినిమా వాటికి భిన్నంగా పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉంటుంది'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబం, స్నేహితులు, ప్రేమ.. ఈ అంశాల మధ్య కథ నడుస్తుంది. కృష్ణమ్మకు సినిమాకు సంబంధమేంటనేది తెరపై చూడాల్సిందే'' అన్నారు.

సినిమాలో గిరిబాబు, ఎమ్మెస్‌ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు, కిషోర్‌దాస్‌, అభిజిత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: హరి, మాటలు: ఖదీర్‌బాబు, ఛాయాగ్రహణం: కె.ఎస్‌.చంద్రశేఖర్‌, కళ: నారాయణరెడ్డి

ఇంతకుముందు కన్నడ చిత్రం గోవిందాయనమహ ని పోటుగాడు గా రీమేక్ చేసిన శ్రీధర్ ...ఈ ఛార్మినార్ చిత్రం సైతం తనకు విజయం ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత హీరోయిన్ గా ఎంపికైంది. ప్రేమ కధా చిత్రం కాంబినేషన్ కావటంతో బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారు.

English summary
Sudheer babu said “Mahesh doin as pullela gopi isn’t true & I am not producing it either. However I & praveen sattaru want to do a film on gopi’s life & I will be playing as gopi. as of now not sure wen this will go on floor.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu