»   » ఘట్టమనేని అభిమానులు కోరుకునే అంశాలుంటాయి

ఘట్టమనేని అభిమానులు కోరుకునే అంశాలుంటాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కృష్ణ, మహేష్‌ అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా చేస్తుండగానే మా మావయ్య సూపర్‌స్టార్‌ కృష్ణ తప్పకుండా ఈ చిత్రం హిట్‌ అవుతుందని ఆశీర్వదించారు. ఇక మహేష్‌బాబు తక్కువ చిత్రాలతో ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకున్నారు. స్టోరీ సెలక్షన్‌లో అతడినే ఫాలో అవుతాను. నా స్టోరీలకు నేనే జడ్జిమెంట్‌ చేసుకుంటాను అంటున్నారు సుధీర్ బాబు.

ఈరోజుల్లో, బస్‌స్టాప్‌ సక్సెస్‌ తర్వాత మారుతి స్వీయ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్‌'. సుధీర్‌బాబు, నందిత హీరోహీరోయిన్స్‌గా ఆర్‌.పి.ఏ క్రియేష న్స్‌-మారుతి టాకీస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం. సుదర్శనరెడ్డి నిర్మాత. ఈరోజుల్లో' ఛాయాగ్రాహకుడు జె.ప్రభాకర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. . 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మీడియా తో మాట్లాడారు.

కథ గురించి చెప్తూ.... 'ప్రేమ కథా చిత్రమ్‌' చిత్రంలో ప్రేమలో ఓడిపోయి చావే శరణ్యం అనుకొంటుంది ఓ జంట. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. ఆ తర్వాత జరిగే పరిస్థితులు ఏమిటి? ఏం జరిగిందీ అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం నాలుగు పాత్రల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. థ్రిల్లింగ్‌గా, ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. కథ చెప్పినదానికన్నా తీసిన విధానం చాలా బాగుంది అన్నారు.

ఇక తొలి చిత్రం ఎస్‌ఎంఎస్‌లో నా పాత్ర చాలా బాగుందని అన్నారు. అయినా ఆ సినిమాలోని లోపాలను సరిదిద్దుకుని ఈ చిత్రాన్ని చేశాను. హీరోయిన్‌ నందిత పెర్పార్మెన్స్‌ హైలెట్‌. మా ఇద్దరికీ ఇది రెండో సినిమా. ఈ సినిమాలో వెన్నెలైనా చీకటైనా గీతం నాకు బాగా ఇష్టం. సీక్వెల్‌గా అన్ని చిత్రాలలో నటించడానికి కుదరదు. నా వరకు హీరో కృష్ణగారి 'అల్లూరి సీతారామరాజు' చిత్రం రీమేక్‌లో నటించాలని ఉంది. ఎప్పటికైనా అవకాశం వస్తే చేస్తానేమో. 'ఆడు మగాడురా బుజ్జీ', 'మాయదారి మల్లిగాడు', 'అగ్గిపుల్ల' చిత్రాలకు కమిట్‌ అయ్యాను. ఈ మూడు చిత్రాల తర్వాతే వేరే ప్రాజెక్టులు అని తెలిపారు.

English summary

 Sudheer Babu’s upcoming film Prema Katha Chitram is going to hit the screens on June 07. Nandita has played the lead role opposite Sudheer Babu. J Prabhakar Reddy has directed the film and he’s also the filmc’s Cinematographer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu