»   » ఇక నిర్మాతగా కూడా: ప్రొడ్యూసర్‌గా మారిన సుధీర్ బాబు

ఇక నిర్మాతగా కూడా: ప్రొడ్యూసర్‌గా మారిన సుధీర్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
ప్రొడ్యూసర్‌గా మారిన స్టార్ హీరో..

ఒక ప్రేమకథా చిత్రం తో మంచి నటుడే అని మార్కులు వేయించుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత బాలీవుడ్ లో భాగీ సినిమాలో విలన్ గానూ మంచి ప్రశంసలనే అందుకున్నాడు. యాక్షన్ .. రొమాంటిక్ హీరోకి కావలసిన అన్ని లక్షణాలు మనకి సుధీర్ బాబులో కనిపిస్తాయి. కానీ పాపం ఎందుకనో సరైన గట్టి అవకాశం మాత్రం ఇప్పటి వరకూ రాలేదు సుధీర్ బాబుకి. 'భలేమంచి రోజు' తరువాత ఆ స్థాయి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

నూతన దర్శకుడు రాజశేఖర్ నాయుడు వినిపించిన కథ నచ్చడంతో, తాజాగా ఆయన ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని కారణాల వలన నిర్మాత చివరి నిమిషంలో పక్కకి తప్పుకున్నాడు. ఈ యంగ్ హీరో ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తోంది. తన కొత్త చిత్రానికి తనే నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట.

Sudheer Babu Turns as Producer for His Next Project

రీసెంట్ గానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. రాజశేఖర్ నాయుడు ఈ మూవీ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని వేరే నిర్మాతతోనే తలపెట్టారట. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఆ నిర్మాత వెనక్కు తప్పుకోవడంతో.. ఈ మూవీని తనే నిర్మించాలని ఫిక్స్ అయిపోయాడట సుధీర్ బాబు.

మూవీ కంటెంట్.. సబ్జెక్ట్.. కొత్త దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ఇటు హీరోగా చేస్తూనే అటు ప్రొడక్షన్ కూడా చేసేయాలని సుధీర్ బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో..రవిబాబు దర్శకత్వం వహించిన 'అదుగో' సినిమాలో కథానాయికగా చేసిన 'నాభా నతేష్' ను .. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

English summary
The source added that the the actor was confident about the content, thus he decided to make the film on his own.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu