‘అత్తారింటికి దారేది’నిర్మాతతో నాగచైతన్య చిత్రం
'తడాఖా'తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా 'మనం' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23న చైతు పుట్టిన రోజు సందర్భంగా 'ఆటోనగర్ సూర్య' ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు.
ఇదిలావుంటే... నాగచైతన్య ఇప్పుడు మరో రీమేక్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. పంజాబీలో విజయవంతమైన 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారు. మొదట ఈ చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ కథరీత్యా చైతన్య అయితేనే బాగుంటుందని నిర్ణయించారు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత డి.రామానాయుడు తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ''పంజాబీలో 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రాన్ని నేనే నిర్మించాను. ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. ఇప్పుడు తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతాం. కథాచర్చలు తుదిదశకు చేరుకొన్నాయి. వచ్చే నెలలో చిత్రీకరణని మొదలుపెడతాం. దర్శకుడు ఎవరనేది త్వరలోనే చెబుతాము''అన్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications












