»   » చావు తర్వాత కూడా ఆ 4 సెకన్లే ముఖ్యం : సుధీర్ బాబు

చావు తర్వాత కూడా ఆ 4 సెకన్లే ముఖ్యం : సుధీర్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుధీర్ బాబు సినిమా పరిశ్రమకి వచ్చి 4-5 సవత్సరాలు అయింది.ఎస్.ఎం.ఎస్ సినిమాతో పరిచయమైన 'సుధీర్ బాబు' ప్రేమకథ చిత్రం సినిమాతో సూపర్ హిట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. మనోడి ఖాతాలో కొన్ని చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా, రావలసిన అంత పేరు రాలేదనే చెప్పాలి.

మహేష్ బాబు బావ

మహేష్ బాబు బావ

సుధీర్ బాబు మనకు సూపర్ స్టార్ క్రిష్ణ అల్లుడిగా,మహేష్ బాబు బావగా సుపరిచితుడే... 5 సినిమాల్లో హీరోగా నటించిన సుధీర్ బాబు యూత్‌లో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. సరికొత్త పాత్రలతో కెరీర్‌లో దూసుకుపోతున్న సుధీర్ బాబు బాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు.

"బాఘీ" లో విలన్ గా

ఇప్పటికే టైగర్ ష్రాఫ్ హీరోగా చేసిన "బాఘీ" లో విలన్ గా కనిపించిన సుధీర్ బాబు కి మంచి మార్కులే పడ్దాయ్. ఈ సినిమా కోసం చాలా కష్టపడి కండలు కూడా పెంచేసాడు. ఆ సమయం లో బాగానే కష్టపడ్దాడు. అంతలా బాడీ ని మెయింటెయిన్ చేయటం కూడా ఈజీ కాదు ప్రతీ విషయం లోనూ జాగ్రత్తగా ఉంటేనే ఆ బాడీ అలా ఉంటుంది.

4 సెకన్లు మాత్రమే చూపిస్తారు

4 సెకన్లు మాత్రమే చూపిస్తారు

ఇప్పుడు ఆ కష్టంపై రియాక్ట్ అయిన సుధీర్ బాబు చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'కనీసం 4 నెలలు కష్టపడితే కానీ అలాంటి బాడీని బిల్డ్ చేయడం సాధ్యం కాదు. కానీ ఆ బాడీని స్క్రీన్ పై కేవలం 4 సెకన్లు మాత్రమే చూపిస్తారు. ఆ విషయం ముందే తెలిసినా అంతగా కష్టపడేందుకు కారణం ఉంది.

అందుకే

అందుకే

రేపు నేను చనిపోయిన తర్వాత కూడా ఆ నాలుగు సెకన్లు అందరికీ కనిపిస్తుంది. అందుకే ఆ 4 సెకన్లకు అంత విలువ ఇవ్వాల్సి ఉంటుంది' అని చెప్పాడు సుధీర్ బాబు. ఇప్పటికీ తన ఫిట్నెస్ ని యథాతథంగా కొనసాగిస్తున్న సుధీర్.. తాజాగా తను వర్కవుట్స్ చేస్తున్న విధానాన్ని.. మజిల్డ్ బాడీని ఫోటోల ద్వారా చూపించాడు.

శమంతకమణి

శమంతకమణి

ప్రస్తుతం నారా రోహిత్.. సందీప్ కిషన్.. ఆదిలతో కలిసి శమంతకమణి అంటూ ఓ యంగ్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు సుధీర్ బాబు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.బ్యాట్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయో పిక్ లో కూడా నటిస్తున్నాడంటూ ఆమధ్య ఒక టాక్ వినిపించింది గానీ తర్వాత మళ్ళీ ఎవరూ ఆ విషయమే మాట్లాడటం లేదు.

English summary
Sudhir, who is a fitness freak, has been working out for the past three years and the results can be seen as he flaunts his toned body on the posters of his upcoming films
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu