twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు హీరోల వీరోచిత లక్షణాలపై సెటైర్లు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈచిత్రం తాజా పోస్టర్ ఒకటి విడుదల చేశారు. తెలుగు హీరోలపై సెటైర్లు వేస్తూ హీరోచిత లక్షణాల డైలాగులు ఉన్న ఆ పోస్టర్ చదువుతుంటేనే ఓ రేంజిలో నవ్వొస్తోంది. మరి అల్లరోడు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో చెబుతుంటే థియేటర్లో నవ్వుల సునామీ ఖాయం.

    హీరోచిత లక్షణాలు

    హీరోలు మొదటిసారి విమానం చూస్తున్నా...అవసరం అయితే వాటిని నడిపే సామర్థ్యం కలిగి ఉంటారు.
    టైటానిక్ షిప్‌లో తెలుగు హీరో లేక పోవడం వల్లే మునిగిపోయింది. తెలుగు హీరో ఉండి ఉంటే ఒంటి చేత్తో స్విమ్మింగ్ చేస్తూ మరో చేత్తో ఓడను ఒడ్డుకు చేర్చేవాడు.
    హీరోలు ఎంత పేదవారైనా రిచ్ అమ్మాయిలను ఇట్టే ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోగల సమర్థులై ఉంటారు.
    హీరోలు, అక్రమాలు అన్యాయాలకు పాల్పడే వారు తను లవ్ చేసే అమ్మాయి తండ్రైనా సరే వాళ్లని తుక్కురేగ్గొడతారు. అసలామాటకొస్తే హీరోలు విలన్ల కూతుళ్లని మాత్రమే ప్రేమిస్తారు.
    హీరోలు(జీన్స్ ప్యాంట్లు వేసుకుని) తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిందిగా ఆడవాళ్లకు లెక్చర్లిస్తుంటారు. వాళ్లు మాత్రం బికినీలు వేసుకునే హీరోయిన్లతో డాన్స్ లు చేస్తారు.
    హీరోలు తమ ఫ్రెండ్స్ చెల్లెళ్లని, తమ చెల్లెళ్లుగా భావిస్తారు.(ఆ అమ్మాయి హాట్ గా ఉంటే మాత్రం ఉద్దేశ్యం మార్చుకుంటారు)
    హీరోలు వంద మందిని కొట్టిన తర్వాత కూడా విగ్గు చెదరకుండా ఉంటారు.
    హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ కలిగి ఉంటారు. తొడగొట్టడంలో నిష్టాతులై ఉంటారు. పంచ్ డైలాగులు చెప్పడంలో ప్రావీణ్యత కలిగి ఉంటారు.

    ఇక తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రమిది. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. అందుకే 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత.

    English summary
    Allari Naresh starrer Sudigadu is a spoof on Telugu cinema's cliched style of film making and silly punch dialogs. People who all wanted to make fun of such things are more than happy to see Sudigadu taking on each and every film and star.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X