»   » ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవారు: నటుడు రంగనాథ్ కూతురు

ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవారు: నటుడు రంగనాథ్ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు. ఇవాళ ఉదయం నుంచి రంగనాథ్ ఏమీ తినలేదని ఆమె చెప్పారు. తాము ఉన్నామంటూ భరోసా ఇచ్చినా లాభం లేకపోయిందని అన్నారు.

తమ్ముడు, చెల్లె బెంగళూరులో ఉంటారని, వారు ఎప్పుడూ ఇక్కడికి రాలేదని ఆమె చెప్పారు. సమాజం కూడా రంగనాథ్‌ను గుర్తించలేదని ఆమె చెప్పారు. తమకు ఏ విధమైన ఆస్తులు కూడా లేవని, చిన్న అద్దె ఇంట్లోనే ఉంటున్నామని ఆమె చెప్పారు. తన తల్లి 2009 నుంచి మరణించినప్పటి నుంచి రంగనాథ్ ఒంటరిగా ఫీలవుతున్నారని ఆమె చెప్పారు.

Ranganath

రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.

తలుపులు పగులగొట్టి చూసేసరికి రంగనాథ్ ఉరి వేసుకుని కనిపించారని, ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. కాగా, బ్యాంక్ డిపాజిట్లు మీనాక్షికి అప్పగించాలని, దానికి సంబంధించిన పత్రాలు బీరువాలో ఉన్నాయని రంగనాథ్ ఓ కాగితంపై రాసి పెట్టారు.

తాను ఒంటిరివాడినని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అంటుండేవారని మీనాక్షి చెప్పింది. గత మూడు రోజులుగా రంగనాథ్ మౌనంగా ఉంటున్నారని ఆమె చెప్పింది.

English summary
Actor Ranganath daughter Neeraja said that his father was in depression after his wife's death.
Please Wait while comments are loading...