»   » నిన్న చిరు...ఇపుడు బాలయ్యను ఎగతాళి చేస్తారట!

నిన్న చిరు...ఇపుడు బాలయ్యను ఎగతాళి చేస్తారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తొలిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మొజారిటీతో గెలిచిన బాలయ్య‌కు త్వరలో ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా బాలయ్య గురించి నటి సుహాసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన కనిపిస్తే ర్యాగింగ్ చేస్తానని వెల్లడించింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని ఈ వ్యాఖ్యలు చేసారు. మీతో చేసిన హీరోలు ఇంకా హీరోలుగానే చలామణి అవుతున్నారు కదా. వాళ్లను చూస్తుంటే మీకేం అనిపిస్తుంది. మీ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సుహాసిని స్పందిస్తూ...నిజంగా వాళ్లు అదృష్టవంతులు. అంబరీష్, చిరంజీవి లాంటివాళ్లు కేంద్రమంత్రులైపోయారు. ఇక రజనీ సార్ ఇప్పటికీ సూపర్‌స్టారే! నిజంగా వీళ్లందర్నీ చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. కలిసినప్పుడల్లా చిరంజీవి గారినీ, అంబరీష్ గారినీ 'ఏం మినిస్టర్!' అని ఎగతాళి చేస్తుంటాను. ఇప్పుడు బాలయ్య కూడా ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు కనిపిస్తే... ఆయనను కూడా ఎగతాళి చేస్తా. వాళ్లకు కూడా మా తరం వాళ్లతోనే సౌకర్యంగా ఉంటుంది. అభిమానంగానూ ఉంటారు.

Suhasini about Balakrishna

ప్రస్తుతం సుహాసిని 'సచిన్ (టెండూల్కర్ కాదు)' అనే సినిమాలో నటిస్తోంది. ఎన్. మోహన్ దర్శకత్వంలో తానికొండ వెంకటేశ్వర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి సుహాసిని చెబుతూ...తమ్ముడి కోసం జీవితాన్ని త్యాగం చేసే అక్క పాత్ర. నా కెరీర్‌లో నేను చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఇందులో చేశానని నమ్మకంగా చెప్పగలను. ఎన్నో ఎమోషన్లు ఆ పాత్రలో ఉంటాయి.

మణిరత్నం దర్శకత్వంలో మహేష్, నాగార్జున సినిమా గురించి మాట్లాడుతూ....అది కొంచెం వాయిదా పడింది. ఆ వివరాలు త్వరలో చెబుతాం. మణి సినిమాల విషయంలో నా ప్రమేయం ఉండదు. త్వరలో ఓ మంచి సినిమా ఆయన నుంచి వస్తుంది.

English summary
"Tollywood actor Balakrishna is a great co-star and a good friend" Popular actress Suhasini said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu