»   » అలీ బూతులు, సీనియర్ నటి సుహాసిని వార్నింగ్?

అలీ బూతులు, సీనియర్ నటి సుహాసిని వార్నింగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అలీకు అడల్డ్ జోక్ లు వేయటం, అది ప్రతీ సారి వార్తల్లో నిలవటం కామన్ అయ్యిపోయింది. అయితే ఆయన అడల్ట్ జోక్స్ ని ఇండస్ట్రీ పెద్దలు బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ప్రతీ పంక్షన్ లోనూ, ఎంతటి వారు ఉన్నా అలీ తన అలవాటు మానకుండా అడల్ట్ జోక్స్ వేసినా కంటిన్యూగా ఆయనకు పిలుపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయన బూతుపురాణం...వార్తల్లో నిలిచింది.

  రీసెంట్ గా సౌత్ స్టార్స్ అందరిని ఏకం చేసే సైమా అవార్డ్స్-2016 వేడుక సింగపూర్ లో ఘనంగా జరుగిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన స్టార్స్ మథ్య జరగిన ఈ వేడుకలో పురస్కారాల ప్రధానోత్సవంతో పాటు, తారల నాట్య విన్యాసాలు, రాక్‌స్టార్ పర్‌ఫార్మెన్స్‌లు, సినీ పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించిన వారిని సత్కరించే కార్యక్రమాలు జరిగాయి. అక్కడకి అలీ కూడా తన భార్యతో కలిసి వెళ్లారు.

  సైమా 2016: రవితేజ నుంచి సమంత దాకా, బన్ని నుంచి రానా దాకా.. (ఫొటోలు)

  Suhasini Serious Warning To Ali

  ఎప్పటిలాగే అలీ ...సైమా వేడుకల్లో చిరంజీవికి సన్మానం జరుగుతున్న సమయంలో , ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు అలవోకగా అలీ ఓ అడల్ట్ జోక్ ని పేల్చేసాడని సమాచారం. చిరు గురించి, ఆయన తో నటించిన హీరోయిన్ల గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ పేల్చాడట. కానీ చిరంజీవి సన్మానం హడావిడిలో ఎవరూ దాన్ని పట్టించుకోలేదట. కానీ సీనియర్ నటి సుహాసిని మాత్రం గుర్తు పెట్టుకుని తర్వాత వార్నింగ్ లాంటి పంచ్ వేసిందని టాక్.

  కార్యక్రమం చివర్లో సుహాసిని మాట్లాడుతూ... అలీ , మరియు మిగతావారంతా యాంకరింగ్ తో అలరించారు. అంతా బాగానే ఉంది కానీ. దయచేసి ఆడవాళ్లను, చిన్నపిల్లలను అవమానించేలా జోక్స్ మాత్రం వేయకండి అని ఆమె అన్నారట. ఇది అలీని ఉద్దించి అన్న చురక అని అందరికి అర్దమైందిట.

  తర్వాత కార్యక్రమం పూర్తయ్యాక అలీ ఈ విషయమై ఆమెకు వివరణ ఇవ్వబోతూంటే ఆమె ఆమె ఇలాంటివి రిపీట్ కావద్దని సున్నితంగా అలీ ని హెచ్చరించారట. ఈ విషయం ఇప్పుడు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. నిజానికి అలీ..మనస్సులో ఏదో పెట్టుుకునే అనేవాడు కాదని, సరాదాగా జోవియల్ గా నవ్వించటానికి ఆ సమయానికి, అక్కడ ఉన్న వారితో చనువు కొద్ది అంటాడని, అంతేకానీ కావాలని ఎవరినీ టార్గెట్ చేయరని, ఇలాంటివి లైట్ తీసుకోవచ్చని కొందరు సీనియర్స్ , అలీ గురించి తెలిసిన వారు అంటున్నారు. అదీ నిజమే.

  ఇక ఈ సైమా అవార్డ్ వేడుకలలో ఈ సారి 12 ప్రత్యేక కార్యక్రమాలు జరగగా, అనిరుథ్ రవిచంద్రన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, హ్యుమా ఖురేషీ, ఉషా ఉతప్, రకుల్ తదితరులు స్టేజ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. నాలుగు పరిశ్రమల నుండి దాదాపు వంద మంది టాప్ స్టార్స్ ఈ వేడుకకు హాజరు అయినట్టు సమాచారం.

  అయితే సైమా అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం అవార్డ్ బాహుబలికి దక్కగా, ఉత్తమ నటుడిగా మహేష్ బాబు ఎంపికయ్యాడు. ఈ వేడుకలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషలకు చెందిన స్టార్స్ కి సైమా అవార్డులను ప్రధానం చేసారు.

  English summary
  As known, Ali’s extreme comedy has landed him into troubles. Recently the comedian has pitched up adult jokes at several occasions. Especially at audio launch events Ali’s spicy double entendres have not gone well with women. In television interview, the actor even apologized and vowed not to repeat it. But old habits die hard aren’t they? Ali appears unable to control his wagging tongue.SIIMA function, Ali repeat it at the time of Chiranjeevi's felicitation. Then after senior actress Suhasini warned in her speech not to make such commets on ladies.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more