Just In
Don't Miss!
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సాహో కాపీ వార్తలపై స్పందించిన సుజీత్!
విమర్శకుల నుండి నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ 'సాహో' చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలివారం బాక్సాఫీస్ వద్ద రూ. 370 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలోనే ఈ మెగా యాక్షన్ ఎంటర్టెనర్ రూ. 400 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వసూళ్ల సంగతి పక్కన పెడితే... 'సాహో' కథ కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. జెరోమ్ సల్లే దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ మూవీ 'లార్గో వించ్' నుంచి కాపీ కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెరోమ్ సల్లే కూడా ఈ విషయమై ట్వీట్ చేస్తూ... తెలుగు దర్శకులు మరొకరి కథను దొంగిలించినపుడు కనీసం సినిమా అయినా బాగా తీయండి అంటూ ట్వీట్ చేశాడు.

వారం రోజుల తర్వాత మీడియా ముందుకు
‘సాహో' మూవీ విడుదలైన వారం రోజుల వరకు మీడియాకు దూరంగా ఉన్న సుజీత్ తాజాగా ప్రెస్ ముందుకు వచ్చి బాక్సాపీస్ వద్ద సినిమా ఫలితం, క్రిటిక్స్ రివ్యూలు, కాపీ ఆరోపనలపై స్పందించారు. ‘సాహో' కథను మీరు ‘లార్గో వించ్' నుంచి కాపీ కొట్టారా? అనే ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించారు.

ఎవరి కథను దొంగిలించలేదన్న సుజీత్
కథను కాపీ కొట్టారా? అని అడగ్గానే సుజీత్ నవ్వేసి... ‘మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారో దాన్ని నేను ఇంత వరకు చూడలేదు' అని సమాధానం ఇచ్చారు. తాను ఏ కథను కాపీ కొట్టలేదని, తన సొంత ఐడియాతో ‘సాహో' కథ రాసినట్లు తెలిపారు.

అర్థం కాకుంటే మళ్లీ చూడండి
‘సాహో'లో మీకు ఏమైనా అర్థమై ఉండకపోతే... మరోసారి చూడండి అంటూ సుజీత్ సూచించారు. క్రిటిక్స్ తమ రివ్యూలు పబ్లిష్ చేసే ముందు కొంత సమయం వేచి ఉంటే బావుంటుందని, ఎందుకంటే రివ్యూలు ప్రేక్షకుల సంఖ్యను ప్రభావితం చేస్తున్నాయని అభిప్రాయ పడ్డారు.

హిందీలో ఆదరణ లభిస్తోంది
సాహోకు హిందీ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందని సుజీత్ తెలిపారు. అక్కడ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ బావుందన్నారు. సుజీత్ ఒక వేళ బీహార్ రాష్ట్రంలో పుట్టి ఉంటే అభిమానులు గుడి కట్టించేవారని వార్తలు రావడం గమనార్హం.

తెలుగు యువకుడు ప్యాన్ ఇండియా సినిమా తీసిన విషయం గుర్తించడం లేదు
కానీ ఇక్కడ.. ఒక తెలుగు యువకుడు ప్యాన్ ఇండియా చిత్రం తీసిన విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. ప్రేక్షకుల నుంచి అభినందనలు వస్తున్నాయి, కలెక్షన్లు కూడా అందుకు ని ఇండికేట్ చేస్తున్నాయని సుజీత్ చెప్పుకొచ్చారు.