»   » ఈ ఏడాది పెళ్లి.. లేకపోతే ఆత్మహత్మ చేసుకొంటా.. ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్

ఈ ఏడాది పెళ్లి.. లేకపోతే ఆత్మహత్మ చేసుకొంటా.. ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిల్ సే చిత్రంలో చయ్య చయ్యా, స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో జయహో పాటతో పాపులర్ అయిన బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్‌ను ఓ అంశం వెంటాడుతున్నది. దాదాపు 45 ఏళ్లకు పైబడినా ఇంకా ఆయన బ్రహ్మాచారి‌గానే ఉన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకోవడమనే అంశం నిద్ర పట్టకుండా చేస్తున్నది. ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఈ ఏడాది ముగింపు కల్లా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఈ ఏడాది పెళ్లి చేసుకోకపోతే బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంటానని ఇటీవల మీడియాతో అన్నారు.

 బావిలో దూకి ఆత్మహత్య

బావిలో దూకి ఆత్మహత్య

ఎవరైనా నాకు పెళ్లి చేయండి. లేకపోతే బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంటాను (కోయి మేరి షాదీ కర్వాదో, నహీతో మై కుయే కూద్ కర్ జాన్ దే దుంగా) అని ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ అన్నారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్‌తో ఇటీవల జరిగిన ఓ సంఘటనను వివరించారు.

 రెహ్మాన్ ప్రాణం తోడేశాడు..

రెహ్మాన్ ప్రాణం తోడేశాడు..

గత మూడు రోజులుగా రెహ్మాన్‌తో కలిసి ఆయన రికార్డింగ్ స్టూడియోలో పనిచేశాను. ఆ సందర్భంగా పెళ్లి చేసుకుంటావా లేదా ప్రాణం తీశాడు. ఇక తోటివారి బాధపడలేదు. వారి కోసమైనా ఈ ఏడాది చివరికల్లా పెళ్లి చేసుకొంటాను అని అన్నారు.

పదేండ్ల నుంచి ప్రయత్నం

పదేండ్ల నుంచి ప్రయత్నం

దాదాపు గత పదేండ్ల నుంచి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాడు. అయితే 2013లోనే ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నట్టు వెల్లడించారు. నేను ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ప్రేమ దేవుడిచ్చిన వరం. నాకు జీవిత సహచరి లభించింది. కొద్ది నెలల్లోనే నాకు కాబోయే భార్య పేరు వెల్లడిస్తాను అని ఆ సందర్భంగా సుఖ్విందర్ సింగ్ తెలిపారు.

 ప్రేమపై రూమర్లు

ప్రేమపై రూమర్లు

అయితే దాదాపు నాలుగేళ్లు గడిచినా ఇంకా పెళ్లి కాకపోవడంపై అనేక రూమర్లు వచ్చాయి. సుఖ్విందర్ సింగ్ ప్రేమ విఫలమైంది అనే వార్తలు వచ్చాయి. ఏదిఏమైనప్పటికీ సుఖ్విందర్ సింగ్ మళ్లీ పెళ్లిపై దృష్టిపెట్టారు. ఈ ఏడాది ముగింపుకల్లా పెళ్లి అవుతుందని ఆశిద్దాం.

 జనతా గ్యారేజ్.. అన్నయ్య

జనతా గ్యారేజ్.. అన్నయ్య

గాయకుడు సుఖ్విందర్ సింగ్ తెలుగు సినీ అభిమానులకు కూడా సుపరిచితుడే. తాజాగా ఆయన జయహో జనతా అంటూ జనతా గ్యారేజ్ చిత్రంలో ఓ పాటపాడారు. ఇంకా అన్నయ్య (ఆట కావాలా పాట కావాలా), రావోయి చందమామ, బంగారం, రచ్చ చిత్రాల్లో తన గళాన్ని వినిపించారు.

English summary
Singer Sukhwinder is dying (almost) to get married but still looking for a soulmate. He says that he will either get married this year or jump into a well and die.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu