twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమాలోనూ ఆ సెంటిమెంట్‌ : సుకుమార్

    By Srikanya
    |

    కాకినాడ : అ.. అంటే అమలాపురం.., డియ్యోలో.. డియ్యోలా వరకు ప్రతీ సినిమాకి ఐటమ్‌ సాంగ్‌ ఉన్నట్లుగానే మహేష్‌తో చేసే సినిమాలోనూ ఒక మాస్‌ మసాలా పాట కచ్చితంగా ఉంటుంది. ఆ పాటల సెంటిమెంట్‌ కొనసాగుతుంది. ఇది యువతను ఉర్రూతలూగించే విధంగానే ఉంటుంది అంటూ చెప్పారు దర్శకుడు సుకుమార్. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కాకినాడ నగరానికి వచ్చిన సుకుమార్‌ తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు.

    అలాగే ... 100 పర్సంట్‌ లవ్‌ తర్వాత మహేష్‌తో ఒక సినిమా చేస్తున్నా. ఇటీవల ఆ ప్రాజెక్టు ప్రారంభించాం. ఈ కథను గోవా వెళ్లి మహేష్‌కి చెప్పా. కథ చెప్పగానే ఓకె చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. ఇది ప్రేమ కథాంశం మాత్రం కాదు. ఈ చిత్రంలో ఢిల్లీకి చెందిన క్రితిసేనన్‌ హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఈమె క్లోజప్‌ పేస్ట్‌ ప్రకటనలో మోడల్‌గా చేసింది అన్నారు.
    ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో ఉంటుంది.

    తన సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్తూ... నా సినిమాలకు ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నా. అతినికి మ్యూజిక్కే ప్రాణం.. ధ్యానం.. ఎప్పుడూ సంగీతంలోనే వూగీసలాడుతుంటాడు.. సన్నివేశం చెప్పాగానే అందుకు తగ్గట్లుగా చరణాలను వెంటనే అందిస్తాడు. దీంతో నా పని తొందరగా పూర్తవుతుంది. అందుకే నేను దేవిని ఎంచుకుంటా అన్నారు.

    అంతేగాక... ప్రతీ వ్యక్తి పదో తరగతి నుంచి ఇంటర్‌.. డిగ్రీ ఇలా ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. నేను కూడా అంతే.. అటువంటి ప్రేమ సన్నివేశాలే నా సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఈరోజుల్లో సక్సస్‌ఫుల్‌ సినిమా కావాలంటే అది లవ్‌ సినిమా మాత్రమే అన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి చెప్తూ... ఇప్పటి వరకు కమర్షియల్‌గా సినిమాలు తీశా. ఎప్పటికైనా వాస్తవ కథల ఆధారంగా సినిమాని తెరకెక్కించే ఆలోచన ఉంది. అది నా డ్రీమ్‌ ప్రాజెక్టు. ఉదాహరణకు శ్రీలంక నుంచి పడవ ప్రయాణం ద్వారా ఆహారం, నీరు లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసి జిల్లాకు వచ్చిన మత్స్యకారుల జీవన విధానం వంటి వాస్తవ కథల ఆధారంగా సినిమా ఉంటుంది. అటువంటి వాటికి బాలివుడ్‌ పరిశ్రమలా అంతర్జాతీయ మార్కెట్‌ ఉండాలి. మనది కేవలం హైదరాబాదు మార్కెట్‌ కావడం కొంత ఆలోచించాలి.. అందుకే డ్రీమ్‌ ప్రాజెక్టుగానే ఉండిపోతుంది అన్నారు.

    కమల్ హాసన్ విశ్వరూపం విషయమై చెలరేగిన విషయమై మాట్లాడుతూ... మన దేశంలో మత విషయాలులాంటి సున్నితమైన అంశాల్ని తాకేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. కమలహాసన్‌ వంటి మహానటుడు తీసిని విశ్వరూపం సినిమాకి అన్ని అవాంతరాలు రావడం ఆయనతో పాటు సినీ పరిశ్రమ మొత్తం బాధపడింది. ఇక సాధారణ వారమైతే పరిస్థితి ఇంకేముంది. అసలు సినిమాని సినిమాగా చూస్తే ఇటువంటి ఇబ్బందులుండవు అన్నారు.

    English summary
    Directed Sukumar visited Kakinada recently and express his views about Films and Viswaroopam. He says Don’t take movies too seriously. Just enjoy them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X