»   »  '1' నేనొక్కడినే గురించి జూ. ఎన్టీఆర్‌

'1' నేనొక్కడినే గురించి జూ. ఎన్టీఆర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో ఎన్టీఆర్‌ అయితే ఇలాగే తియ్‌. ఇదే కరెక్ట్‌ అన్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా అనే కొత్తగా ప్రయత్నించాను. ప్రయోగం అనుకుంటే అస్సలు తీయకపోయేవాడిని అంటూ సుకుమార్ వివరించారు. '1' నేనొక్కడినే చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాని కలిసిన సుకుమార్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే '1' నేనొక్కడినే విడుదల తర్వాత మిశ్రమ స్పందన వచ్చిందనీ, అయితే మహేష్‌బాబు మొదటి నుంచి పూర్తి నమ్మకంతో ఉండడంతో ఒక్కరోజు ఆగి చూడండి, ఖచ్చితంగా ఫలితాలు వేరుగా వస్తాయని చెప్పారనీ, అదేవిధంగా 20నిముషాలు ట్రిమ్‌ చేశాక అన్ని కేంద్రాలనుంచి మంచి స్పందన లభిస్తోందని'' చిత్ర దర్శకుడు సుకుమార్‌ అన్నారు.

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే భారీ చిత్రం షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌ స్పీడు మీదున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఇప్పుడాయన సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పుడు సుకుమార్‌ కథకూ ఓకే చెప్పారు. ఎన్టీఆర్‌- సుకుమార్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

నిర్మాత మాట్లాడుతూ ''సుకుమార్‌గారు ఈ చిత్రం కోసం సూపర్ సబ్జెక్ట్ సిద్ధం చేశారు. మా బేనర్‌లో ఇది మరో హిట్ మూవీ అవుతుందనే నమ్మకం కలిగింది. సుకుమార్‌ చెప్పిన కథాంశం మాకెంతో నచ్చింది. వెంటనే ఎన్టీఆర్‌ కూడా పచ్చజెండా వూపారు. అభిమానుల్ని అలరించేలా అన్ని అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం'' అన్నారు.

''ఎన్టీఆర్‌ శైలిని దృష్టిలో ఉంచుకొని రాసిన కథ ఇది. ఆయన పాత్రని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నా. తప్పకుండా అభిమానులకు ఈ సినిమా పండగే. ఎన్టీఆర్‌కు చెప్పిన లైన్ విని ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఇమేజ్‌కి తగినట్లుగా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూనే సరికొత్త స్టయిల్‌లో ఈ సినిమా ఉంటుది'' అంటున్నారు సుకుమార్‌. ఈ చిత్రానికి సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary
Sukumar's next film will NTR would go to sets in April. "This is going to be another sensational movie in our banner," he said. NTR heard the storyline and found it most exciting story, said the director Sukumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu