»   »  సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ అనుమానస్పద మృతి

సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ అనుమానస్పద మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను షాకింగ్ కు గురి చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఆదివారం రాత్రి కూకట్‌పల్లిలోని రెయిన్‌బో అపార్ట్‌మెంట్ మూడో అంతస్థుపై నుంచి క్రింద పడి మృతి చెందాడు. అయితే దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేటంత కారణాలు ఏమీ లేవని, పొరపాటున జారి పడి ఉండవచ్చు అని సినీ పరిశ్రమలో వినపడుతోంది

Sukumar Assistant Director Vikram Dies Passed Away

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంభందించిన విషయాలు తెలియాల్సివుంది. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ మృతిపై అతని సోదరుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కాగా విక్రమ్ చాలా రోజులుగా సుకుమార్ వద్ద పని చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి విక్రమ్ అసిస్టెంట్ గా పని చేశాడు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Assistant director Vikram, who has been working under well known Tollywood director Sukumar, committed suicide Sunday night. His suicide came to the notice of the media very late.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu