»   » సుకుమార్ ఏడవసారి అద్భుతమే చేశాడు.. సుక్కు టచ్ చేసిన ఆ నాలుగు అంశాలు!

సుకుమార్ ఏడవసారి అద్భుతమే చేశాడు.. సుక్కు టచ్ చేసిన ఆ నాలుగు అంశాలు!

Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ఇప్పటివరకు చాలా మంది మంచి ప్రతిభ కలిగిన దర్శకులు వచ్చారు. వారిలో దర్శకుడు సుకుమార్ తప్పకుండా ప్రత్యేకంగా కనిపిస్తారు. కమర్షియల్ అంశాలు మిస్ అవ్వకుండా సుకుమార్ తన చిత్రాలలో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు.

Rangasthalam Movie Review రంగస్థలం రివ్యూ

తన ప్రతి చిత్రం ప్రేక్షకుల భిన్నమైన అనుభూతిని కలిగించేలా ఉండాలని సుకుమార్ భావిస్తాడు. అందుకే సుకుమార్ దర్శకత్వ శైలిని అభిమానించేవారు చాలా మందే ఉంటారు. సినిమాల విషయంలో స్లో అండ్ స్టడీగా వెళ్లడమే సుక్కు పాలసీ. తాజాగా సుకుమార్ రంగస్థలం చిత్రంతో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.

స్లో అండ్ స్టడీగా సుకుమార్

స్లో అండ్ స్టడీగా సుకుమార్

సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయి 14 ఏళ్ళు గడుస్తోంది. ఈ పద్నాలుగేళ్ల కాలంలో సుకుమార్ చేసింది కేవలం 7 చిత్రాలు మాత్రమే. సుకుమార్ తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశ పరిచి ఉండవచ్చు. కానీ ప్రత్యేకతని మాత్రం చాటుకున్నాయి. సుకుమార్ తన ఏడు చిత్రాలలో నాలుగు అంశాలని టచ్ చేశాడు.


ప్రేమకథా చిత్రాలు

ప్రేమకథా చిత్రాలు

సుకుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం ఆర్య. విభిన్నమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యువతని ఉర్రూతలూగించింది. ఆ తరువాత ఆర్య 2, 100 పర్సెంట్ లవ్ వంటి ప్రేమ కథలని తెరకెక్కించారు.


 జగడంతో యువతకు సందేశం

జగడంతో యువతకు సందేశం

యువత గ్యాంగ్ లు ఏర్పాటు చేయడం, గ్రూపులు కట్టడం, మాఫియాతో సంబంధాలు ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ జగడం చిత్రాన్ని తెరకెక్కించారు. కాలేజీ యువతకు ఈ చిత్రం చక్కటి సందేశాన్ని ఇచ్చినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది.


మెదడుకు పదును పెట్టే కథలు

మెదడుకు పదును పెట్టే కథలు

సుకుమార్ మైండ్ గేమ్ తరహా కథలని కూడా టచ్ చేశాడు. మహేష్ బాబుతో చేసిన 1 నేనొక్కడినే, ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో చిత్రాలు ఆ కోవకు చెందినవే. 1 నేనొక్కడినే చిత్రం నిరాశ పరిచినప్పటికీ నాన్నకు ప్రేమతో చిత్రం మంచి విజయం సాధించింది.


రంగస్థలంతో 40 ఏళ్ళు వెనక్కి

రంగస్థలంతో 40 ఏళ్ళు వెనక్కి

ఈ సారి రంగస్థలం చిత్రంతో సుకుమార్ ఇంకాస్త కొత్తగా ఆలోచించారు. ప్రేక్షకులని 40 ఏళ్ళు వెనక్కు తీసుకుని వెళ్లాలని భావించిన సుకుమార్ ఆలోచన బావుంది. రంగస్థలం చిత్రంపై ఈ తరహాలో క్రేజ్ ఏర్పడడానికి కారణం ఇదే. 1980 కాలం నాటి లోకల్ రాజకీయాలని మళ్ళీ చూపించాడు.


 ఏడవసారి అద్భుతమే చేశాడుగా

ఏడవసారి అద్భుతమే చేశాడుగా

సుకుమార్ గత ఆరు చిత్రాలు ఒక ఎత్తు రంగస్థలం చిత్రం మరో ఎత్తు అని చెప్పొచ్చు. తన చిత్రాలలో ప్రత్యేకతని చూపించేందుకు సుకుమార్ ఎలా ఆరాటపడతాడో రంగస్థలం చిత్రం ద్వారా అర్థం అవుతోంది. రంగస్థలం చిత్రంతో సుకుమార్ అద్భుతమే చేశాడని అంటున్నారు.


English summary
Sukumar once again proves his speciality with Rangasthalam movie. Rangasthalam movie gets unanimous positive report.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X