twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగస్థలం కాపీ వివాదం: ఆరు పేజీల్లో సుకుమార్ సుధీర్ఘ వివరణ!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Sukumar Responds On Rangasthalam Copy Controversy

    రామ్ చరణ్ హీరోగా తాను రూపొందించిన 'రంగస్థలం' చిత్రంపై నెలకొన్న కాపీ వివాదం దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఈ కథను ఎక్కడి నుండి కాపీ కొట్టలేదని, సొంతగా తాను రాసుకున్నదే అని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌కు ఆరు పేజీల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ నేతృత్వంలోని సంఘం..... సుకుమార్ వివరణతో ఏకీభవిస్తూ అధికారిక నోటీసు జారీ చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఫిర్యాదుదారు, సినీ రచయిత యం. గాంధీకి సూచించింది.

    ఏమిటి వివాదం?

    ఏమిటి వివాదం?

    ‘రంగస్థలం' స్టోరీ తన ‘ఉక్కుపాదం', ‘రివేంజ్' కథల ఆధారంగా తయారు చేసిందే అని, ఈ విషయంలో తనకు తగిన న్యాయం చేయాలని సినీ రచయిత యం. గాంధీ కొన్ని రోజుల క్రితం తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌ను ఆశ్రయించారు.

    హీరో, విలన్‌ను చంపేప పాయింట్ నా కథలోనదే...

    హీరో, విలన్‌ను చంపేప పాయింట్ నా కథలోనదే...

    ‘రంగస్థలం' చిత్రంలో హీరో తన శత్రువును చంపే విధానం తన కథ నుండి కాపీ కొట్టిందే అని, చావు బ్రతుకుల్లో ఉన్న శత్రువును తొలుత రక్షించి.... అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత తాను ఎందుకు చంపుతున్నానో అతడికి అర్థమయ్యేలా చెప్పి చంపే విధానం తన ‘ఉక్కుపాదం', ‘రివేంజ్' కథల నుండి తీసుకున్నదే అని రచయిత యం. గాంధీ ఆరోపించారు.

    సుధీర్ఘ వివరణ ఇచ్చిన సకుమార్

    సుధీర్ఘ వివరణ ఇచ్చిన సకుమార్

    గాంధీ చేసిన ఆరోపణలపై సుకుమార్ ఆరు పేజీల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. తాను ‘రంగస్థలం' కథ రాసుకోవడానికి తనను ఇన్స్‌స్పైర్ చేసిన నవలలు, సినిమాలను ఉదహరిస్తూ సుకుమార్ వివరణ ఇచ్చారు. ‘ధర్మయుద్ధం' అనే సినిమా చూసినప్పటి నుంచి తనకు ఈ ఆలోచన ఉన్నట్లుగా సుకుమార్ కమిటీకి తెలిపారు.

    గాంధీకి హక్కు ఉండదని తేల్చిన కమిటీ

    గాంధీకి హక్కు ఉండదని తేల్చిన కమిటీ

    విలన్‌ను రక్షించి ఆ తర్వాత చంపే పాయింట్ గతంలో చాలా సినిమాల్లో, పుస్తకాల్లో, నవలల్లో వచ్చిందని... ఈ పాయింటు మీద యం.గాంధీకి హక్కు ఉండదని కమిటీ తేల్చి చెప్పింది. గాంధీ రాసిన కథలో కిడ్నీ దానం చేసి, శత్రువును బ్రతికించి ఆ తర్వాత చంపినట్లుగా ఉంది. ‘రంగస్థలం'లో యాక్సిడెంటుకు గురై కోమాలోకి వెళ్లిన శత్రువుకి 2 సంవత్సరాలు సేవలు చేసి అతడు ఆరోగ్యవంతుడు అయిన తర్వాత చంపినట్లు ఉంది అని కమిటీ పేర్కొంది.

     మీ ఆరోపణలను కమిటీ పరిష్కరించజాలదు

    మీ ఆరోపణలను కమిటీ పరిష్కరించజాలదు

    ప్రాథమిక సాక్షాధారాలు మీరు లేవనెత్తిన పాయింట్ మీకంటే ముందే వివిధ కథలు, నవలలు, సినిమాల్లో వచ్చిందని నిరూపిస్తున్నాయి. మీ సమస్యను కథా హక్కుల కమిటీ పరిష్కరించజాలదు అని.... యం.గాంధీకి తెలుగు సినీ రచయితల సంఘం తేల్చి చెప్పింది.

    న్యాయస్థానాన్ని ఆశ్రయించండి

    న్యాయస్థానాన్ని ఆశ్రయించండి

    దీనిపై మీకు ఇంకా న్యాయం పొందాలని అనుకుంటే న్యాయ పరిధిలోని కాపీరైట్ యాక్ట్ క్షుణ్ణంగా తెలిసిన న్యాయవాదుల సమక్షంలో మీరు మీ హక్కుకై పోరాడవచ్చు. ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని... యం.గాంధీకి కమిటీ సూచించింది.

    రచయితల సంఘం జారీ చేసి అధికారిక నోట్

    రచయితల సంఘం జారీ చేసి అధికారిక నోట్

    రంగస్థలం కాపీ వివాదం, యం. గాంధీ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం తెలుగు సినీ రచయితల సంఘం గాంధీకి పంపిన అధికారిక నోట్.

    వివాదానికి తెర పడినట్లేనా?

    వివాదానికి తెర పడినట్లేనా?

    రచయితల సంఘం వివరణతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. అయితే మరి ఈ విషయమై యం.గాంధీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

    English summary
    Sukumar Responds on Rangasthalam Copy controversy. Sukumar gave his clarification that he got the idea after watching 'Dharma Yuddham' movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X