»   »  డైలాగులు చెప్తూ.... అల్లు అర్జున్ రచ్చ చేస్తూ...( ఫొటోలు)

డైలాగులు చెప్తూ.... అల్లు అర్జున్ రచ్చ చేస్తూ...( ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌ జంటగా కొత్త దర్శకుడు సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్‌' చిత్ర ఆడియో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. ఈ చిత్రానికి టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్...రుద్రమదేవి చిత్రంలోని డైలాగులు చెప్తూ అలరించారు. అలాగే తను సినిమా చూపిస్తా మామ చిత్రం చూసానని, రాజ్ తరణ్ బాగా చేసాడని సినిమా పెద్ద హిట్ అవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి.

స్లైడ్ షోలో ఆడియో పంక్షన్ విశేషాలు .... ఫోటోలు

ముఖ్య అతిధిగా

ముఖ్య అతిధిగా

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చిత్ర యునిట్ సమక్షంలో అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా ఈ ఆడియో విడుదల జరిగింది.

దిల్ రాజు చేతుల మీదుగా

దిల్ రాజు చేతుల మీదుగా

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

అల్లు అర్జున్ ఆవిష్కరించారు

అల్లు అర్జున్ ఆవిష్కరించారు

ఆడియో సీడీని నటుడు అల్లు అర్జున్‌ ఆవిష్కరించారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...

అల్లు అర్జున్ మాట్లాడుతూ...


ఇలాంటి సినిమా చేసేటప్పుడు చాలా కాంపాక్ట్ బడ్జెట్ ఉంటుంది. అలాంటిది ఇలాంటి తక్కువబడ్జెట్ లో దేవి చేయటం తనకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తూ...

అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తూ...

రజినీకాంత్‌, ఐశ్వర్యరాయ్‌ల సూపర్‌హిట్‌ కాబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రానికి పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ...

సుకుమార్ మాట్లాడుతూ...

ప్రతాప్ లేకపోతే ఈ సినిమా లేదు...నా చేత స్క్రిప్టు రాయించుకుంది తను. డైరక్టర్ గా అతనికి మంచి భవిష్యత్ ఉంది. నా త్రీ ఇడియట్స్...నేను, రత్నవేలు గారు, దేవిశ్రీప్రసాద్ కలిసి చేసాం..అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ...

హీరోయిన్ మాట్లాడుతూ...


చిత్రం చాలా హిట్టవుతుందని అని ఆశాభావం వ్యక్తం చేసారు. టెక్నీషియన్స్ కు, నిర్మాత సుకుమార్ కు ఆమె ధాంక్స్ తెలిపారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ...

రాజ్ తరుణ్ మాట్లాడుతూ...

సుకుమార్ , దేవిశ్రీప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వారితో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...

బన్నీ 12 ఇయిర్స్ బ్యాక్ ఏం అల్లరి చేసామో గుర్తు చేసుకోమన్నారు. సుకుమార్ ఓ దర్శకుడు నుంచి నిర్మాతగా మారుతున్న ఈ సందర్బంగా కంగ్రాట్స్ అన్నారు.

దర్శకుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ....

దర్శకుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ....

టైటిల్ చూస్తూంటే ఒక దేవిశ్రీ, రత్నవేలు, సుకుమార్ వీరి ముగ్గరు ఫిల్మ్ అని చెప్పినట్లు ఉంది. గ్రేట్ టెక్నిషియన్స్ చేస్తున్న సినిమా ఇది. ఇధి ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ...

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ...

ఈ సినిమాకు పనిచేయటానికి మెయిన్ రీజన్..ఫీల్ మై లవ్ అని ఫ్రెండ్ షిప్ మధ్య ఉండే లవ్ అని, సుకుమార్ మీద మాకందరికీ ఉన్న లవ్ అని దేవి అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్.

గిప్ట్ లు ...

గిప్ట్ లు ...

ఈ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కాన్టెస్ట్‌ విజేతలకు నటుడు అల్లు అర్జున్‌ చేతుల మీదుగా బహుమతులను అందించారు.

హర్షం

హర్షం

సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై నూతన దర్శకుడు, కొత్త మాటల రచయిత వంటి ఎందరికో అవకాశం కల్పిండంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

టెక్నిషియన్స్ ఎవరెవరు..

టెక్నిషియన్స్ ఎవరెవరు..

నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

English summary
Sukumar's maiden production "Kumari 21F" 's Audio released.
Please Wait while comments are loading...