»   » దేవిశ్రీ హీరోగా సినిమాపై మౌనం వీడిన సుకుమార్

దేవిశ్రీ హీరోగా సినిమాపై మౌనం వీడిన సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మించబోతున్న దిల్ రాజు ఆ మద్య స్వయంగా ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ ప్రకటన చేసారు. అ ప్రాజెక్టు గురించి ప్రకటనైతే చేసారు కానీ ఎలాంటి వివరాలు వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు ప్రకటించి చాలా రోజులైనా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. కనీసం సినిమా ఎలా ఉండబోతోందనే క్లూ కూడా దిల్ రాజు నుండి గానీ, దేవిశ్రీ, సుకుమార్ నుండి గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు విషయమై సుకుమార్ మౌనం వీడారు.

Sukumar's Konaseema Family Drama

సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం మంచి విజయం సాధించడం, రూ. 50 కోట్ల షేర్ సాధించడంతో సుకుమార్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తూ తన స్నేహితులను, బంధువులను కలుస్తూ రిలాక్స్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఎదురుపడ్డ మీడియాకు తన తర్వాతి ప్రాజెక్టు గురించి తెలిపారు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ తో తాను చేయబోయే తర్వాతి సినిమా కోనసీమ బ్యాక్ డ్రాపులో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఉంటుందని స్పష్టం చేసారు. అదే విధంగా తన తర్వాతి ప్రాజెక్టులను గురించి తెలిపారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సినిమా ఓకే అయినట్లు తెలిపాురు.

English summary
During his ongoing Konaseema tour, Sukumar told the media that his film with Devi Sri Prasad will be a family entertainer with a Konaseema backdrop since he and DSP hail from Konaseema region. However, one wonders if this film will go on floors in the near future.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu