»   »  'కుమారి 21ఎఫ్‌' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

'కుమారి 21ఎఫ్‌' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :స్టార్ డైరక్టర్ సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌' మొన్న శుక్రవారం విడుదలైంది. మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగానూ భాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది.

మొదటి వీకెండ్ (శుక్ర,శని,ఆది)వారాల్లో 6.43 కోట్లు వరకూ కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి వారాంతానికి డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి వస్తారని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని పది కోట్లకు అమ్మారు. ఓపినింగ్స్ అదిరిపోయే రేంజిలో రావటం సినిమాకు బాగా కలిసి వచ్చింది.


ఏరియావైజ్ కలెక్షన్స్ ...


Sukumar's Kumari 21 F First Weekend Collections

నైజాం- 2.35 కోట్లు


సీడెడ్ - 76 లక్షలు


వైజాగ్ - 58 లక్షలు


గుంటూరు - 36 లక్షలు


తూర్పు గోదావరి- 40 లక్షలు


పశ్చిమగోదావరి - 36 లక్షలు


కృష్ణా - 42 లక్షలు


నెల్లూరు - 7 లక్షలు


మొత్తం 5.3 కోట్లు (ఎపి/నైజాం)


కర్ణాటక 46 లక్షలు


USA 63 లక్షలు


మిగతా ప్రాంతాలు 4 లక్షలు


ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6.43 కోట్లు


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మరో ప్రక్క కుమారి 21 ఎఫ్ చిత్రానికి మూలం లైలా సేస్ అనే ఫ్రెంచ్ సినిమా అని తేల్చారు . 2004లో వచ్చిన ఈ చిత్రం కథ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉండటంతో ఇలాంటి అభిప్రాయానికి వచ్చారు. స్రీన్ ప్లే మొత్తం దాదాపు అలాగే సాగుతూ..ప్రీ క్లైమాక్స్ లో ఉన్న బలమైన మలుపు ఏదైతే ఉందో అది కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇక క్లైమాక్స్ ని అందరూ మెచ్చుకుంటూంటే... ఆ సన్నివేశం కూడా ది సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్ అనే సినిమాలోది కావటం కూడా అభిమానులకు ఆశ్చర్యంగా మిగిలింది.


ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

English summary
"Kumari 21F" collected about Rs 6.43 crore at the worldwide box office in the first weekend.
Please Wait while comments are loading...