»   » థ్యాంక్స్ టు 'బాహుబలి': సుకుమార్

థ్యాంక్స్ టు 'బాహుబలి': సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇవాళ సంక్రాంతి రిలీజ్‌లు నాలుగూ సినిమాలూ ఆడుతున్నాయీ అంటే దానికి కారణం బాహుబలి అంటున్నారు సుకుమార్. ఆయన మాట్లాడుతూ.... థ్యాంక్స్ టు 'బాహుబలి'. ఆ సినిమా కొన్నేళ్ళుగా బయటకు రాని జనాన్ని ఇళ్ళల్లో నుంచి సినిమా హాలుకి మళ్ళీ రప్పించడం మొదలుపెట్టింది అన్నారు దర్శకుడు సుకుమార్. సంక్రాంతికి విడుదలైన సుకుమార్ చిత్రం నాన్నకు ప్రేమతో టాక్ తో సంభంధం లేకుండా కలెక్షన్స్ కురిపిస్తోంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు.

పక్కవాళ్ళ సినిమా చూసినప్పుడు ఇలాంటిది మనం తీయలేకపోయామనో, మన సినిమాయే బాగా ఆడాలనో జెలసీ గురించి చెప్తూ...సుకుమార్ - సెకన్‌లో వెయ్యోవంతు ఒక చిన్నపాటి జెలసీ ఫీలింగ్ రావడం మానవ సహజం. క్రియేటివ్ ఫీల్డ్‌లో మరీ. కానీ, వెంటనే దాన్ని పాజిటివ్‌గా, ఆనందంగా మార్చుకోవాలి. మారుతుంది అన్నారు.

Sukumar says thanks to Baahubali

సుకుమార్ తనకు ఇష్టమైన సినిమాలు గురించి చెప్తూ...పత్యేకించి కొన్ని సినిమాలని చెప్పడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు చూస్తూ ఉండేసరికి, రోజుకో సినిమా ఇష్టమై, ప్రభావం మారిపోతుంటుంది. అయితే, బేసిగ్గా రామ్‌గోపాల్ వర్మ, కృష్ణవంశీ, మణిరత్నం అంటే నాకు బాగా ఇష్టం. మరీ ముఖ్యంగా, వర్మ గారి సినిమాలంటే! నేను టీచింగ్ వదిలేసి, దర్శకత్వం వైపు వచ్చేయాలని నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా మణిరత్నం 'గీతాంజలి' అన్నారు.

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
Director Sukumar says thanks to Baahubali movie for Shankranthi Collections.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu