For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ, చీలిక వస్తుందేమో’

  By Bojja Kumar
  |

  'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... 'అసుర అసుర అసుర' సాంగుకు, నాకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ సాంగ్ మొదటి లిరిక్ విన్నది నేనే. నా ఆత్మ మిత్రుడు దేవి, బోసుగారు. మేముగ్గురం కలిసినపుడు ఆత్మల సమ్మేళనం జరుగుతుంది. ఏదేదో లోకంలోకి వెళ్లిపోతూ ఉంటామని తెలిపారు.

  ఈ మధ్య కాలంలో ఇంత అద్భుతమైన లిరిక్ రాలేదు. ఇన్ని వైరుధ్య భావాలతో ఇంత అద్భుతంగా వినలేదు. వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. లిరిక్ రాసిన నా ఫేవరెట్ లిరిక్ రైటర్ చంద్రబాబోస్ గారికి థాంక్స్ ఇంత అద్భుతమైన లిరిక్ ఇచ్చినందుకు, అదే విధంగా దేవికి థాంక్స్ చెబుతున్నాను ఇంత అద్భుతమైన లిరిక్ ఇండస్ట్రీకి ఇచ్చినందుకు... అని సుకుమార్ వ్యాఖ్యానించారు.

  ఎన్టీఆర్ నట సముద్రం

  జై లవ కుశ... ఎన్టీఆర్ ఒక నట సముద్రం, ఆ నట సముద్రం నుండి నేను, శివ ఒక చెంబు, బకెట్ తీసుకెలుతుంటే, బాబీ ఏకంగా ట్యాంకర్ తీసుకెళ్లాడు. జై, లవ, కుశ ఇలాంటి మూడు క్యారెక్టర్లు చేయాలంటే ఆ సముద్రానికే సాధ్యం... అని సుకుమార్ అన్నారు.

  ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ వస్తుందేమో

  ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ వస్తుందేమో

  ‘జై లవ కుశ' సినిమా తర్వాత మీ ఫ్యాన్స్ అనవసరంగా గొడవలు పెట్టుకుంటారేమో? జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చీలికి వస్తుందేమో? అని భయం వేస్తుంది. అంటే జై ఫ్యాన్స్ కొంత మంది, లవ్ ఫ్యాన్స్ కొంత మంది, కుశ ఫ్యాన్స్ కొంత మంది విడిపోతారేమో అనిపిస్తోంది. దయచేసి అలా చేయొద్దు, ఈ మూడు చేసింది ఒక్కరే. మీరు అది బాగా గుర్తుంచుకోండి, గొడవలు పెట్టుకోవద్దు.... అంటూ సుకుమార్ జోక్ చేశారు.

  దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...

  దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...

  దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``తార‌క్‌తో ఇది కంటిన్యుయ‌స్‌గా మూడో సినిమా. నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఇది నాకు ఆయ‌న‌తో మూడో సినిమా. ఈ సినిమాలో ఒక సీన్ను చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నారు. ఆ సీన్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చాలా అబ్బుర‌ప‌డ్డా. ట్రిపుల్ రోల్స్ చేసేట‌ప్పుడు మామూలుగా స్లాప్స్టిక్ కామెడీ ఉంటుంది. కానీ ఇందులో చాలా సీరియ‌స్‌గా ఉంటుంది. తార‌క్ న‌ట‌న‌ను నేను ఎంజాయ్ చేస్తూ రీరికార్డింగ్ చేశాను.. అని తెలిపారు.

  రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

  రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

  'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.

  పూర్తి స్పీచ్ కోసం క్లిక్ చేయండి

  ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

  ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

  'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి, సినిమా కోసం తన తమ్ముడు తారక్ పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  జై లవ కుశ

  ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి. ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ... రామ లక్ష్మణులయ్యారు అంటూ 'జై లవ కుశ' ట్రైలర్ మొదలైంది.

  English summary
  Director Sukumar funny speech at Jai Lava Kusa theatrical trailer launch Event. Jai Lava Kusa is an upcoming Telugu language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X