»   » సుకుమార్ నెక్ట్స్ ప్రొడక్షన్ ‘డైరెక్టర్’

సుకుమార్ నెక్ట్స్ ప్రొడక్షన్ ‘డైరెక్టర్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు దర్శకుడిగా ఇతర బేనర్లలో స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం చేస్తూ.... సొంతగా నిర్మాణ సంస్థ స్థాపించి చిన్న సినిమాలు నిర్మిస్తున్నాడు సుకుమార్. అతని ఫస్ట్ ప్రొడక్షన్ ‘కుమారి 21ఎఫ్' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. తాజాగా సుకుమార్ తన నిర్మాణ సంస్థపై రెండో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి ‘డైరెక్టర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కూడా స్టోరీ స్వయంగా సుకుమారే సమకూర్చారు. ఈ సినిమాను కూడా ఇతర డైరెక్టర్ తోనే చేయబోతున్నాడు. త్వరలోనే దర్శకుడు ఎవరు? అనేది ఖరారు చేయనున్నారు. తొలి సినిమా కుమారి 21ఎఫ్ సుకుమార్ కు మంచి లాభాలే తెచ్చిపెట్టింది.

Sukumar to kickstart his second production?

ప్రస్తుతం సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో' మూవీ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 27న విడుదలవుతోంది. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
Even as he awaits the release of his Sankranthi treat, Nannaku Prematho, director Sukumar is said to be working on launching his second home production. The film, tentatively titled Director, is reportedly written by Sukumar himself and the director will once again rope in another director to helm the project.
Please Wait while comments are loading...