»   » సుకుమార్ నెక్స్ట్ మూవీ అతడితోనేనా.. మరో సంచలనమే!

సుకుమార్ నెక్స్ట్ మూవీ అతడితోనేనా.. మరో సంచలనమే!

Subscribe to Filmibeat Telugu

సుకుమార్ లేటెస్ట్ మూవీ రంగస్థలం టాలీవుడ్ రికార్డులని తిరగరాస్తోంది. రంగస్థలం చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాసర్ చిత్రాల్లో బాహుబలి తరువాత రెండవస్థానాని ఆక్రమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1980 నాటి రాజకీయ పరిస్థితులతో రంగస్థలం చిత్రాన్ని సుకుమార్ ఆసక్తికరమైన డ్రామాగా తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందుకున్నారు. రంగస్థలం లాంటి భారీ విజయం తరువాత దర్శకుడిపై దర్శకుడిపై ఒత్తిడి పెరగడం ఖాయం. నెక్స్ట్ మూవీని కూడా అభిమానులు అంతే స్థాయిలో ఊహించుకుంటారు.

కాగా రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ బోయపాటి, రాజమౌళి చిత్రాలతో బిజీకాబోతున్నాడు. సుకుమార్ తదుపరి చిత్రం ఏంటనే చర్చ సినీవర్గాల్లో మొదలైంది. సుకుమార్ దర్శత్వం శైలి అందరు హీరోలని ఆకట్టుకుంటుంది. మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్స్ ఈ దర్శకుడితో పనిచేసారు.

Sukumar will going to direct Prabhas

సుకుమార్ తదుపరి చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సుకుమార్ మాట్లాడుతో తనకు ప్రభాస్ తో పనిచేయాలనే కోరికని బయట పెట్టాడు. ప్రస్తుతం ప్రాధమిక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా సుకుమార్ దర్శకత్వం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని విషయాలు తెలియనున్నాయి. బాహుబలితో జాతీయ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నా ప్రభాస్, రంగస్థలం చిత్రంతో రికార్డుల మోత మోగిస్తున్న సుకుమార్ జత కలిస్తే మరో సంచలనమే అవుతుందని అభిమానులు అంటున్నారు.

English summary
Sukumar will going to direct Prabhas. Sukumar and Prabhas are very excited to team up soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X