»   »  ఇదేమైనా డీజే ప్రమోషన్ ఫంక్షనా? బన్నీపై ఎన్నారై ల అసంతృప్తి

ఇదేమైనా డీజే ప్రమోషన్ ఫంక్షనా? బన్నీపై ఎన్నారై ల అసంతృప్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

విదేశాలలో ఉండే తెలుగు వాళ్ళ ఫంక్షన్ లకి మన తారలు వెళ్ళటం కొత్తదేం కాదు. ఓవర్సీస్ లో కూడా మార్కెట్ మొదలయ్యాక ఈ మధ్య ఇది మరీ ఎక్కువయ్యింది. తానా, ఆటా లాంటి సభలకు వెళ్ళటం అక్కడ ఉన్న తెలుగు వారిని పలకరించటం అక్కడ సభల్లో ప్రసంగించటం ఈ మధ్య కాలం లో పెరిగి పోయింది. అక్కడికి వెళ్ళిన హీరోలు కూడా దేశాన్నీ ఇక్కడి వాతావరణాన్ని గుర్తు చేస్తూ మాట్లాడటం మామూలే.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

మొన్నటికి మొన్న విక్టరీ వెంకటేష్ ప్రసంగం కూడా అక్కడ చాలామందిని ఆకట్టుకుంది. ఇక ఆతర్వాత వంతు ఇప్పుడు అల్లు అర్జున్ కి వచ్చింది. ఈ మధ్యనే అక్కడ కూడా విడుదల అయ్యి సరైన విజయం మూటఘట్టుకోలేక పోయిన డీజే ప్రమోషన్ గా కూడా పనికి వస్తుందనుకొని వెళ్ళిన బన్నీ అక్కడ వాళ్ళని ఆకట్టుకోలేక పోగా అసహనానికి గురి చేసాడంటూ టాక్ మొదలయ్యింది.20 నిముషాలు కూడా సరిగా లేకుండా

20 నిముషాలు కూడా సరిగా లేకుండా

అల్లుఅర్జున్ అమెరికాలోని చికాగోలో అతిధిగా పాల్గొన్న నాటా ఉత్సవాలలో తన స్పీచ్ వల్ల కానీ లేదంటే తన ప్రవర్తన వల్ల కానీ అమెరికాలోని తెలుగువారి ప్రశంసలు పొందలేకపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నాటా ఉత్సవాలకు అతిధిగా వెళ్ళిన అల్లుఅర్జున్ అక్కడ కేవలం 20 నిముషాలు కూడా సరిగా లేకుండా ఏదో తొందర తొందరలో తప్పని సరై వచ్చాను తప్ప పెద్ద ఇంట్రస్ట్ లేదు అన్నట్టు ప్రవర్తించాడట.అంటీముట్టనట్లుగా

అంటీముట్టనట్లుగా

అంతేకాదు ఆ ఉత్సవాలకు వచ్చిన అనేకమంది ప్రతినిధులతో అల్లుఅర్జున్ అంటీముట్టనట్లుగా ఒక విధమైన దర్పం ప్రదర్శిస్తూ బన్నీ కనపరిచిన వ్యవహార శైలికి చాలామంది షాక్ అయినట్లు టాక్. ముఖ్యంగా నాటా సంస్థ గురించి కానీ అమెరికాలోని తెలుగువారి కృషి గురించి కానీ ఏమి మాట్లాడలేదట.డిజే ప్రమోషన్ ఫంక్షనా?

డిజే ప్రమోషన్ ఫంక్షనా?

కేవలం ‘డిజే' మూవీ గురించి దానిపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి బన్నీ మాట్లాడటంతో ఇది నాట్స్ సంస్థ ఉత్సవమా ? లేదంటే ‘దువ్వాడ జగన్నాథమ్' ప్రమోషన్ ఫంక్షన్ ? అనుకోవాలా అంటూ నాట్స్ సంస్థ ఉత్సవాలకు ప్రతినిధులుగా వచ్చిన చాలామంది తమలో తాము కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..
English summary
things finally ended up as a huge disappointment for 4,000 audience who anticipated some interaction and fun moments with the stylish star at NATS event
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu