»   » ఇంటర్వ్యూ కోసంవెళ్ళి జైల్లో ఇరుక్కున్న యాంకర్ సుమ

ఇంటర్వ్యూ కోసంవెళ్ళి జైల్లో ఇరుక్కున్న యాంకర్ సుమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. . ఈ సినిమా లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించబడింది. ప్రస్తుతం 'బాహుబలి: ది కంక్లూజన్‌' పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిమ్‌ సిటీలో వేసిన సెట్లో జరుగుతోంది.

'బాహుబలి' మొదటి భాగానికి సంబంధించి వీడియో క్లిప్ బయటకి వచ్చినప్పుడు రాజమౌళి, అతని బృందం చాలా గాబరా పడ్డారు. అయితే రెండో భాగం తీస్తున్నప్పుడు అయినా జాగ్రత్త పడలేదు. సినిమాలోని అతి కీలకమైన సన్నివేశాలు అందులో అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య వచ్చే సీన్స్ తో కలిపి ఫుటేజ్ బయిటకువచ్చింది.దాంతో మేలుకున్న రాజమౌళి సెట్ లో సెక్యూరిటీ విపరీతంగా పెంచేసాడు.

Suma kanakala at bahubali 2 sets

కనీసం స్మార్ట్ ఫోన్ లూ, పెండ్రైవ్ లూ, పర్స్‌నల్ లాప్‌టాప్ లూ అనుమతించటం లేదు. అసలు సెక్యూరిటీ దాటి ఒక చీమ కూడా తప్పించుకునే వీలు లేదు అయితే శుక్రవారంనాడు అక్కడకు వెళ్లిన సుమమాత్రం ఆ నిబంద్దనలను లెక్క చేయకుండా ఆ సెట్లో ఓ సెల్ఫీ తీసుకుందట. 'బాహుబలి' సెట్‌కు వచ్చేవారెవరూ కెమేరాలు, సెల్‌ఫోన్లు తీసుకురాకూదని, సెల్ఫీలు అసలు తీసుకోకూడదని జక్కన్న ఆర్డర్‌ వేసిన విషయం తెలిసిందే కదా.

ఈ ఆర్డర్‌ను పట్టించుకోని సుమ అక్కడ సెల్ఫీ తీసుకుంది. దీంతో వెంటనే దేవసేన కోసం తయారుచేసిన జైల్లో పడిపోయింది. తనను విడిపించమని వేడుకుంది. ఎవరూ వినకపోయేసరికి ఆ జైలు నుంచే రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఇదంతా 'బాహుబలి' ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా శివరాత్రి రోజు దర్శకుడు రాజమౌళి వెరైటీగా ప్లాన్‌ చేసిన ప్రోగ్రామ్‌.

Suma kanakala at bahubali 2 sets

వెరైటీగా దేవసేన జైల్లో సుమను ఉంచి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు రాజమౌళి. ఆ తర్వాత తమ సినిమా ఆడియో ఫంక్షన్‌ ప్రోగ్రామ్‌కు డబ్బులు తీసుకోకుండా హోస్ట్‌గా వ్యవహారిస్తానని మాట ఇస్తేనే జైలు నుంచి విడుదల చేస్తానని కండీషన్‌ పెట్టాడు. అందుకు సుమ అంగీకరించడంతో వెంటనే ఆమెను విడుదల చేసి ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాడు.

English summary
Tollywood Anchor Suma has been detained and sentenced to jail..., and it is part of the pre-release promotions of 'Baahubali: The Conclusion'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu