»   » రూమర్స్ అధిగమించి....యాంకర్ సుమ కొత్త అవతారం!

రూమర్స్ అధిగమించి....యాంకర్ సుమ కొత్త అవతారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇరవై మూడేళ్ల కెరీర్‌... వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ... ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ.

తెలుగులో తిరుగులేని యాంకర్ గా దూసుకెలుతున్న సుమపై అప్పట్లో షాకింగ్ రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. యాంకరింగ్ అంటేనే చాకచక్యంగా మాట్లాడటం మాత్రమే కాదు...కొన్ని సార్లు అందరికీ వినిపించేలా అరవడం కూడా. ఇలా వేలాది కార్యక్రమాల్లో అరిచీ అరిచీ సుమ గొంతు మూగబోయే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో రూమర్స్ హల్ చల్ చేసాయి. యాంకరింగ్ ఇలానే కొనసాగిస్తే సుమ మరింత ఇబ్బందుల్లో పడుతుందని, పర్మినెంటుగా వాయిస్ క్రాక్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు రావడంతో ఆమె అభిమానులంతా కంగరు పడ్డారు.

అయితే అవన్నీ రూమర్సే అని తేలింది. ఏదో చిన్న గొంతు సమస్యతో సుమ డాక్టర్ దగ్గరికి వెళితే....దాన్ని మరోలా ప్రచారం చేసారు. ఈ విషయమై సుమ కూడా స్పందిస్తూ నా గొంతుకు ఏమీ కాలేదని వివరణ ఇచ్చారు.

పాట పాడుతున్న సుమ

పాట పాడుతున్న సుమ

యాంకరింగ్ ద్వారా సుమకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈటీవీలో ప్రసారమవుతూ తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన 'స్టార్‌ మహిళ' కార్యక్రమం ద్వారా అత్యధిక ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా ఆమె జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పింది. స్టార్ మహిళ కార్యక్రమానికి 2వేలకు పైగా ఎపిసోడ్లకు సుమ యాంకరింగ్ చేసింది.

సినిమాల్లో కూడా పాడుతుందేమో?

సినిమాల్లో కూడా పాడుతుందేమో?

సుమ జోరు చూస్తుంటే సినిమాల్లో కూడా పాటలు పాడేలా ఉంది.

సుమ

సుమ

సుమ చిన్నతనంలో ఇలా ఉండేది.

మలయాళి

మలయాళి

మయాళి భామ అయిన సుమ తొలుత హీరోయిన్ గా ప్రయత్నాలు చేసింది. పలు చిత్రాల్లో నటించింది.

సుమ-రాజీవ్

సుమ-రాజీవ్

భర్త రాజీవ్ కనకాలతో కలిసి సుమ.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

సుమ, రాజీవ్ కనకాల ఫ్యామిలీ పిక్...

పెళ్లి

పెళ్లి

రాజీవ్ కనకాల, సుమ పెళ్లి ఫోటో...

క్యూట్ ఫ్యామిలీ

క్యూట్ ఫ్యామిలీ

తెలుగు నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.

అప్పుడు అలా రూమర్స్ అధిగమించిన సుమ.... ఇపుడు తన గొంతకు మరింత పదును పెట్టింది. సింగర్ గా మారింది. మాటీ టీవీలో త్వరలో ప్రసారం కాబోయే కార్యక్రమం కోసం సింగర్ గా మారింది. రఘు కుంచె కంపోజ్ చేసిన ఈ సాంగును సుమ ఆలకించారు. నిన్న ఈ పాటకు సంబంధించిన రికార్డింగ్ జరిగింది. రఘు కుంచె ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు కొన్ని ఫోటోస్ పోస్టు చేసారు. ఈ సాంగును రవికాంత్ రచించారు.

English summary
Suma has turned playback singer for an upcoming TV show on a popular entertainment channel. Yesterday, Suma recorded a lively song composed by noted music director Raghu Kunche. The music director himself has revealed this news and posted a couple of photographs on his Twitter page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu