»   » ఏదో ఫ్రాంక్‌ కాల్‌ అనుకున్నా...ఫాస్ట్ గా జరిగిపోయిందంటూ... వివరించిన సుమ

ఏదో ఫ్రాంక్‌ కాల్‌ అనుకున్నా...ఫాస్ట్ గా జరిగిపోయిందంటూ... వివరించిన సుమ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఇన్నాళ్లూ బుల్లితెరపై మాటలతోనూ మెప్పించిన సుమ.. ఇప్పుడు సింగర్‌గానూ సత్తా చాటింది. సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విన్నర్' సినిమాలో సుమ పాడిన స్పెషల్ సాంగ్‌కు ఇప్పుడు సూపర్ క్రేజ్ వచ్చింది. మరో యాంకర్ అనసూయ ఈ పాటలో ఆడింది. ఇలా సుమతో పాట పాడించిన ఘనత కూడా తమన్‌కే దక్కడం విశేషం. ఇది నిజంగా ప్రత్యేకమే. ఈ అవకాశం తనకు ఎలా వచ్చిందో వివరించింది సుమ.

సుమ మాట్లాడుతూ... 'తమన్‌కు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో.. ఎలా వచ్చిందో నాకర్థం కావడం లేదు. తమన్‌గారు నాకు కాల్‌ చేసినపుడు ఏదో ఫ్రాంక్‌ కాల్‌ అనుకున్నా. నన్ను ఆటపట్టించడానికి నాకు కాల్‌ చేశారనుకున్నా. 'తమన్‌ గారూ.. నాకు తెలుసు మీరు నన్ను ఆటపట్టించడానికి కాల్‌ చేశారు' అని నేను అనగానే.. లేదు లేదు మీరు నిజంగా పాడాలి అని తమన్‌ అన్నారు.

Suma Shares Her ‘Anasuya’ song Experience

చెప్పిన నెల రోజుల తర్వాత చెన్నైకు రమ్మని పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత లిరిక్‌ చూపించారు.
అది చూసి పాడేశాను. అంతా చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింద'ని చెప్పింది సుమ. ఈ పాటకు నేను డ్యాన్స్‌ చేస్తే బాగోదని, అనసూయతో వేయించారేమో అని సుమ సరదాగా వ్యాఖ్యానించింది. అనసూయ ఎప్పుడూ తన ఫేవరెట్‌ అని చెప్పింది సుమ.

ఇక 'బిజినెస్ మేన్' సినిమాలో దర్శకుడు పూరితో పాటు, మహేష్ బాబు చేత కూడా పాట పాడించి అప్పట్లో ప్రిన్స్ అభిమానులను ఖుషీ చేశాడు ఈ యువ సంగీత దర్శకుడు. అలాగే రభస' సినిమాలో రాకాసి రాకాసి అనే పాటను తారక్ చేత పాడించి రచ్చ చేయించాడు తమన్. అయితే అక్కడితో ఆగలేదు.

పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఓ కన్నడ సినిమాలోనూ ఎన్టీఆర్ చేత పాడించి అదరహో అనిపించేశాడు. ఇదే సినిమాలో మరో పాటను కాజల్ అగర్వాల్ పాడటం మరో విశేషం.

డైలాగ్ డెలివరీలో తనదైన మేనరిజం చూపించే రవితేజతోనూ ఓ పాట పాడించడం తమన్‌కే చెల్లింది. అప్పట్లో రవితేజ పాట పాడుతున్నాడంటే ఎవరూ పెద్దగా నమ్మలేదు. అయితే.. పవర్ సినిమాలోని నోటంకి పాటతో సెలబ్రిటీలతో పాటలు పాడించడంలో తన పవర్ చూపించాడు తమన్. ఇక శ్రుతి హాసన్ చేత 'రేసుగుర్రం'లో డౌన్ డౌన్ అంటూ అదరకొట్టాడు. ఆపై 'ఆగడు' సినిమాలోనూ శ్రుతి చేసిన స్పెషల్ సాంగ్‌ను ఆమెతోనే పాడించాడు తమన్.

English summary
Suma was roped in to sing a special song for the film Winner. Thaman successfully made this happen and Suma recently shared her experience with this song. Winner stars Sai Dharam Tej and Rakul Preet in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu