For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైఎస్ జగన్‌తో దొంగచాటుగా, విడాకులైన కీర్తిరెడ్డితో ఇంకా రిలేషన్.... సుమంత్ చాలా చెప్పాడు!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన స్టార్స్‌లో....ఎఎన్ఆర్ మనవడు సుమంత్ ఒకరు. యాక్టింగ్ టాలెంట్, అందం, పర్సనాలిటీ ఉన్నప్పటికీ ఎందుకనో స్టార్ హీరో రేంజికి మాత్రం వెళ్లలేక పోయాడు.

  ప్రస్తుతం సుమంత్ నటించిన 'నరుడా డోనరుడా' మూవీ రిలీజైంది. హిందీలో హిట్టయిన వికీడోనర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. వీర్యదానం కాన్సెప్టుకు కామెడీ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశాజనకమైన ఫలితాలే ఇస్తోంది.

  సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల అలీ హోస్ట్‌గా చేసే ఓ కార్యక్రమంలో సుమంత్ పాల్గొన్నారు. ఇందులో నరుడా డోనరుడా విశేషాలతో పాటు, తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆస్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  సుమంత్

  సుమంత్

  సుమంత్ అప్పట్లో హీరోయిన్‌గా ‘తొలి ప్రేమ' చిత్రంలో నటించిన కీర్తి రెడ్డిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2004లో కీర్తి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సుమంత్ కాపురం రెండేళ్లలోనే కూలిపోయింది. 2006లో విడాకులు తీసుకున్నారు.

  కీర్తి రెడ్డితో రిలేషన్ ఇంకా..

  కీర్తి రెడ్డితో రిలేషన్ ఇంకా..

  సుమంత్‌తో విడాకులు తీసుకున్న తర్వాత కీర్తి రెడ్డి మరొకర్ని పెళ్లాడింది. యూఎస్ఏలో సెటిలైంది. అయితే సుమంత్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయాడు. విడాకులైన తర్వాత ఇద్దరి మధ్య శతృత్వం ఉంటుందని అనకుంటారు చాలా మంది. కానీ సుమంత్, కీర్తి రెడ్డిల మధ్య అలాంటిదేమీ లేదు. వీరి మధ్య ఇంకా రిలేషన్(ఫ్రెండ్షిప్) కొనసాగుతోంది.

  కీర్తి రెడ్డి గురించి సుమంత్ స్పందిస్తూ..

  కీర్తి రెడ్డి గురించి సుమంత్ స్పందిస్తూ..

  కీర్తి రెడ్డితో ఇంకా మంచి సంబంధాలే ఉన్నాయి. తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటాం. విడాకులు తీసుకున్నంత మాత్రాల రిలేషన్ ఉండకూడదా అంటూ తనదైన రీతిలో స్పందించారు సుమంత్.

  కీర్తి రెడ్డి కుటుంబం గురించి

  కీర్తి రెడ్డి కుటుంబం గురించి

  2004లో మా పెళ్లిజరిగింది 2006లో విడిపోయాం, తను వేరే పెళ్లిచేసుకుని హ్యాపీగాఉంది, వాళ్లది చాలా మంచి కుటుంబం, తనతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నా. ఇప్పటి వరకు పెళ్లిపై పెద్దగా ఇంట్రస్ట్‌లేదు. ప్రస్తుతానికి ఆ అవసరం కూడా నాకు లేదని నా ఫీలింగ్. లైఫ్ కంఫర్టబుల్‌గా ఉంది. భవిష్యత్తులో పెళ్లి చేసకుంటానా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను అని సుమంత్ తెలిపారు.

  గర్ల్స్ ఫ్రెండ్స్

  గర్ల్స్ ఫ్రెండ్స్

  నా లైఫ్ లో చాలా మంది గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్‌, కాలేజ్‌ రోజుల్లో అయితే చాలామంది ఉండే వారు. ప్రస్తుతం అయితే నేను సింగిల్. ఇక ముందు నా జీవితంలోకి ఎవరైనా వస్తారా? లేదా? అనే దానిపై ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేను అన్నారు.

  అది మంచి సినిమా కాదు

  అది మంచి సినిమా కాదు

  నాగార్జున, సుమంత్‌ కాంబినేషన్లో అప్పట్లో ‘స్నేహం అంటే ఇదేరా' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ మామ అల్లుళ్లు అయిన నాగార్జున, సుమంత్ ఈ సినిమాలో స్నేహితులుగా నటించారు. అయితే బాక్సాఫీసు వద్ద ఈ మూవీ ప్లాప్. దీనిపై సుమంత్ స్పందిస్తూ... అది మంచి సినిమా కాదు అంటూ ఒక్కమాటలో చెప్పేసారు. మేము ఇద్దరం కలిసి నటించినంత మాత్రాన అది గొప్ప సినిమా కాదని, అభిమానులను అలరించలేదని స్పష్టం చేసారు.

  అఖిల్ ప్లాప్ మూవీపై

  అఖిల్ ప్లాప్ మూవీపై

  మళ్లీ మామయ్య నాగార్జునతో సినిమా చేయాల్సి వస్తే...మంచి సినిమా అయితేనే చేస్తాను అన్నారు. కొన్ని సినిమాలు కాంబినేషన్‌ క్రేజ్‌తో వస్తుంటాయి, అలాంటివి పెద్దగా ఆడిన సందర్భాలుండవని చెబుతూ, ‘అఖిల్‌' తొలి సినిమాను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు సుమంత్. వివి వినాయక్-అఖిల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద ప్లాన్.

  వైఎస్ జగన్‌తో ఫ్రెండ్సిప్ గురించి

  వైఎస్ జగన్‌తో ఫ్రెండ్సిప్ గురించి

  ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి...సమంత్‌ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరూ ఒకే క్లాస్‌లో, ఒకే బెంచ్‌లో కూర్చుని చదువుకున్నారు. చిన్న వయసులో వారిద్దరూ కలిసి చాలా సరదాగా తిరిగేవారట.

  ఓ రోజు జగన్-సుమంత్ దొంగచాటుగా

  ఓ రోజు జగన్-సుమంత్ దొంగచాటుగా

  టీనేజ్‌లో ఉన్నపుడు...జగన్-సుమంత్ అర్థరాత్రి వరకు తిరిగేవారట. అలా ఓసారి చాలా రాత్రయ్యాక ఇంటికి వచ్చి దొంగచాటుగా పైకి ఎక్కుతూ అక్కినేని నాగేశ్వరరావుకి దొరికిపోయారట...ఈ విషయాలన్నీ సుమంత్ స్వయంగా వెల్లడించారు.

  English summary
  Sumanth Reveals Unknown Facts about Ex Wife Keerthi Reddy in tv show with Ali.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X