»   »  మామయ్య రూటులో సుమంత్

మామయ్య రూటులో సుమంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sumanth
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద ఫ్లాపు గా నిలిచిన చిత్రం 'పౌరుడు'. దీని ద్వారా ప్రియదర్శన్ శిష్యుడు రాజ్ ఆదిత్య పరిచయమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడితో సినిమా చెయ్యటానికి సుమంత్ సంకల్పించాడు. నిర్మాత కూడా సుప్రియ(పౌరుడు నిర్మాత) కావటం మరో విచిత్రం. దాంతో 'డాన్' ఫ్లాప్ అయినా తిరిగి లారెన్స్ కి తన తదుపరి సినిమా 'పవర్' అప్పచెప్తున్న మేనమామ నాగార్జునని సుమంత్ ఫాలో అవుతున్నాడంటున్నారు.

దానికి సుమంత్ సమాధానంగా "సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. అయినా ఆ సినిమాలో నా పాత్రను తీర్చిదిద్దిన తీరూ, అ కథకు అతడిచ్చిన ట్రీట్‌మెంట్ బాగా వచ్చాయి. అందుకే మళ్లీ అతనితో కలిసి పని చేయాలని భావిస్తున్నాను" అని సన్ని హితులతో అంటున్నాడు. ఇప్పటికే ఆదిత్య చెప్పిన లైను సుమంత్‌కు సూపరుగా నచ్చిందిట. దాంతో స్క్రిప్ట్ పూర్తి గా డెవలప్‌ చేసుకోమన్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు మూడు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇది విన్న వాళ్ళు సుమంత్ సంగతేమో గాని రాజ్ ఆదిత్య అదృష్టవంతుడు..మొదటి చిత్రం పరాజయం పాలైనా రెండో సినిమా పెద్ద గ్యాప్ లేకుండానే పట్టాడంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X