రొమాంటిక్ కామెడీ... ('అంతకు ముందు ఆ తరువాత' ప్రివ్యూ)

By Srikanya

Sumanth Ashwin “Anthaku Mundu Aa Taruvatha” preview
హైదరాబాద్ : సున్నితత్వం, సృజనాత్మక అంశాలతో సినిమాల్ని తీయడం మోహనకృష్ణ ఇంద్రగంటి శైలి. విలువలతో కూడిన చిత్రాల్ని తీయడానికి ఆయన ఇష్టపడుతుంటారు. 'గోల్కొండ హైస్కూల్‌' తర్వాత ఆయన తీసిన చిత్రం 'అంతకు ముందు ఆ తరువాత'. నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించారు. ఈషా హీరోయిన్. కె.ఎల్‌. దామోదర్‌ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం (ఈరోజు) శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ప్రేమలో గెలవడం ఒక ఎత్తయితే... ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. జీవితాంతం తోడుగా ఉంటాననే భరోసాని ఎదుటి వ్యక్తిలో కల్పించినప్పుడే అది నిలబడుతుంది. నవతరం ఆ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తున్నారు? వారిలో ఉన్న చిన్నపాటి గందరగోళానికి కారణమేమిటి? ఓ జంట ప్రేమలో పడటానికి ముందు ఎలా ఉంటుంది?, ఆ తర్వాత ఎలా మారిపోతుంటుంది? అనే విషయాలను చర్చిస్తూ ఎంటర్టైన్మెంట్ ని జోడిస్తూ తీసిన చిత్రం ఇది.

దర్శకుడు మాట్లాడుతూ-''ఒకరినొకరు ఇష్టపడడం మొదలయ్యాక... సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ అనుబంధం మాటున ఎలాంటి విషయాలు బయటికొస్తాయి. వాటి ద్వారా ప్రేమికుల మధ్య ఎలాంటి అనుమానాలు చోటు చేసుకొంటాయి అనే అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి'' అన్నారు .

అలాగే ...''కెనడాలో ఫిలింకోర్స్‌ చేసి, ఇక్కడ ఎందరినో కలిశాను. అంతా 'నీకేం వచ్చు?' అని అడిగారు. 'గ్రహణం' స్క్రిప్టు విని భరణి నటించడానికి వెంటనే ఒప్పుకున్నారు. ఆయన పరిచయానికి ముందు, ఆ తర్వాత నా జీవితంలో ముఖ్యం. కళ్యాణి ఇచ్చిన ఐతే ..సంగీతం నచ్చింది. అష్టాచెమ్మా సంగీతంతో అభిప్రాయాలు, అభిరుచులూ కలిశాయి. అందుకే ఈ సినిమాకీ కలిసి పనిచేశాం. నా అనుభవాలు, ఊహల కలబోతతో 7 పాటలిచ్చారాయన'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యువతరం ఆలోచనలు ఏ రీతిన ఉంటున్నాయో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది''అన్నారు.

బ్యానర్ : శ్రీ రంజిత్ మూవీస్
నటీనటులు : సుమంత్‌ అశ్విన్‌ , ఈషా, రవిబాబు, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్‌ తదితరులు .
ఛాయాగ్రహణం: పి.జి.విందా,
కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,
కళ: ఎస్‌.రవీందర్‌,
సంగీతం: కల్యాణి కోడూరి,
సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి.,
నిర్మాత : కె.ఎల్. దామోదర్ ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X