»   »  ఆవకాయ కలుపుతున్నాడీ హీరో (ఫొటో)

ఆవకాయ కలుపుతున్నాడీ హీరో (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని కుటుంబానికి సన్నిహితంగా గా ఉండేవారందరికీ వేసవి రాగానే గుర్తు వచ్చే విషయం ఆవకాయ. ఎందుకంటే అక్కినేని కుటుంబం నుంచి ప్రత్యేకంగా పెట్టిన ఆవకాయను అందరికి పంపుతూండేవారు. చివరకు విదేశాలు కూడా ఈ ఆవకాయ వెళ్ళేది. ఈ విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అక్కినేని అన్నపూర్ణ గారు పూర్తి శ్రద్ద తీసుకుని,ఆవకాయ పెట్టించి అందరికీ పంపుతూండేవారు. ఇప్పుడీ సంప్రదాయాన్ని వారి మనవడు సుమంత్ కంటిన్యూ చేస్తున్నాడు.

ఈ సంవత్సరం తాను ఆవకాయ కలుపుతున్నట్లు, ఆ సంప్రదాయన్ని కంటిన్యూ చేస్తున్నట్లు చెప్తూ సుమంత్ ట్విట్టర్ లో ఈ ఫోటో పెట్టారు. అంటే ఇప్పుడు సుమంత్ తన చేతులతో స్వయంగా కలిపిన ఆవకాయను వారి శ్రేయాభిలాషులు,కుటుంబ సభ్యులు తినబోతున్నారన్నమాట. ఆ కుటుంబ వారసత్వం నిలబెట్టాలన్న సుమంత్ ప్రయత్నం మెచ్చదగినదే అంటున్నారు అంతా.

Sumanth busy preparing Avakai!

సినిమమాల విషయానికి వస్తే... సుమంత్ హీరోగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో 'ఏమో గుర్రం ఎగరావచ్చు' అంటూ ఓ చిత్రం ఆ మధ్యన వచ్చింది. 'ఆ నలుగురు ఫిలిమ్స్' సంస్థ నిర్మించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నమోదు అయ్యింది. 'ఏమో... గుర్రం ఎగరావచ్చు' చిత్రానికి చంద్రసిద్ధార్థ్‌ దర్శకుడు. రచయిత, దర్శకుడు మదన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయినా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం సుమంత్ ఖాళీగా ఉన్నారు.

English summary
Sumanth who was last seen in Emo Gurram Egara Vachchu shared the picture of him mixing avakai. He even tweeted "That time of the year again --Annapurna Avakai! The #tradition continues..".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu