»   »  అక్కినేని ఫ్యామిలీ హీరో... వీర్య దాతగా!

అక్కినేని ఫ్యామిలీ హీరో... వీర్య దాతగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా స్టార్ హీరో రేంజికి ఎదగలేక పోయాడు. అయితే తనకు సూటయ్య సినిమాలు ఎంచుకుంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆయన సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాక పోవడంతో అవకాశాలు తగ్గాయి.

దీంతో ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు సుమంత్. ఎట్టకేలకు సుమంత్‌కు ఓ ప్రాజెక్టు ఓకే అయింది. బాలీవుడ్ హిట్ మూవీ ‘వికీ డోనర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో సుమంత్‌తో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Sumanth comeback with Vicky Donor remake

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నారు. హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. పల్లివి శుభాష్ అనే భామను హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.

తెలుగు నేటివిటీకి తగిన విధంగా స్క్రిప్టు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కాన్సెప్టు బాలీవుడ్లో సక్సెస్ అయింది కానీ... తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చర్చనీయాంశం అయింది.

English summary
Actor Sumanth from Akkineni Khandan is waiting for right film to make a comeback. Ignoring the criticism and shedding all the inhibitions, he is coming up with "Vicky Donor" Telugu remake, which we revealed long time back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu