For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కీర్తిరెడ్డితో బ్రేకప్‌కు కారణం అదే.. నా టైం అయిపోయింది.. నాగార్జున ఏమీ చేయలేని పరిస్థితి.. సుమంత్

  By Rajababu
  |

  అక్కినేని నట వారసుడిగా వచ్చిన సుమంత్ తొలి నాళ్లలో మంచి విజయాలను సొంతం చేసుకొన్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ చిత్రం ద్వారా మంచి హీరోగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత యువకుడు, సత్యం, గౌరీ లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించిపెట్టాయి. కానీ వరుస ఫ్లాప్‌ల కారణంగా టాలీవుడ్ పరిశ్రమకు కొంత దూరమయ్యాడు.

  పెళ్లి తర్వాత నటి కీర్తిరెడ్డికి విడాకులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన కెరీర్ గాడిలో పడలేకపోయింది. తాజాగా ఆయన నటించిన మల్లీరావా అనే చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆయన వ్యక్తిగత, కుటుంబ, సినీ విశేషాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

  అమ్మానాన్నకు దూరంగా

  అమ్మానాన్నకు దూరంగా

  చిన్నతనం నుంచి అమ్మా,నాన్నకు దూరంగా పెరిగాను. మా అమ్మ చనిపోయిన తర్వాత తాత అక్కినేని నాగేశ్వర్‌రావు వద్దనే పెరిగి పెద్దయ్యాను. ఆయనతో అనుబంధం చాలా ఎక్కువ. ఆయన ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది.

   నాగార్జునతో విభేదాలు లేవు

  నాగార్జునతో విభేదాలు లేవు

  మల్లీరావే చిత్ర ప్రమోషన్‌లో మేనమామ అక్కినేని నాగార్జున పాల్గొనకపోవడం విభేదాలే కారణమన్న విషయాన్ని సుమంత్ తప్పుపట్టారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆయన వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటం కారణంగా ఆయన ప్రమోషన్‌లో పాల్గొనలేదు. నాగచైతన్య వచ్చి నా సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నాడు.

   హీరోగా నిలబెట్టింది మామయ్యనే

  హీరోగా నిలబెట్టింది మామయ్యనే

  నన్ను హీరోగా నిలబెట్టింది చిన్నమామయ్యనే. నేను ఫ్లాపుల్లో ఉంటే సత్యం సినిమా తీసి నాకు బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో సినిమా ఇచ్చి నా కెరీర్‌ను నిలబెట్టాడు. ప్రస్తుతం అఖిల్‌ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో మామయ్య బిజీగా ఉన్నారు.

   నా టైం అయిపోయింది

  నా టైం అయిపోయింది

  ప్రస్తుతం నాగ్ మామయ్య నన్ను హీరోగా నిలబెట్టడానికి అవకాశం లేదు. నా టైం అయిపోయింది. నా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొనే పనిలో ఉన్నాను. అవసరమైతే మామయ్య నాకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు.

   అలా అంటే ఒప్పుకోను

  అలా అంటే ఒప్పుకోను

  నాకు సినిమాలను ఎంపిక చేసుకోవడం రాదు అంటే ఒప్పుకొను. కొన్నిసార్లు మనం ఎంచుకొన్న సినిమాలు ఆడుతాయి. కొన్ని పరిస్థితుల వల్ల మంచి చిత్రాలను ఎంపిక చేసుకోలేకపోతాం. అంతమాత్రాన ఓ నిర్ణయానికి రావొద్దు.

   ఆ సినిమా చాలా చెత్త

  ఆ సినిమా చాలా చెత్త

  నేను నటించిన సినిమాల్లో రాజ్ సినిమా అతి చెత్త చిత్రం. వీఎన్ ఆదిత్యను తప్పుపట్టే సమస్యలేదు. ఆ సినిమాకు ఆదిత్య పూర్తి బాధ్యుడు చేయడం తప్పు. ఎందుకంటే ఆయన కేవలం ఆ ప్రాజెక్ట్ మధ్యలో వచ్చాడు. ఆయన ఈ చిత్రానికి పూర్తిస్థాయి దర్శకుడు అంటే నేను ఒప్పుకోను.

   నువ్వేకావాలి అందుకే చేయలేదు

  నువ్వేకావాలి అందుకే చేయలేదు

  నువ్వే కావాలి చిత్రం నా వద్దకు ముందు వచ్చింది. కానీ ఆ సమయంలో యువకుడు, మరో చిత్రం చేస్తున్నాను. డేట్స్ సమస్య రావడంతో నేను ఆ సినిమాను చేయలేకపోయాను. ఆ తర్వాత స్రవంతి రవికిషోర్ సినిమాలో నటించాను.

   పెళ్లి నాకు వర్కవుట్ కాలేదు

  పెళ్లి నాకు వర్కవుట్ కాలేదు

  పెళ్లిపై నాకు పెద్దగా అభిప్రాయం ఏమీలేదు. అది కొందరికి వర్కవుట్ అవుతుంది. కొందరికి వర్కవుట్ కాదు. నాకు కీర్తిరెడ్డికి మధ్య ఉన్న దాంపత్య జీవితం కేవలం ఏడాది మాత్రమే. మా అభిప్రాయాలు కలువకపోవడంతో విడిపోవాలని అనుకొన్నాం. అంతే జరిగింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. త్వరలో పెళ్లి చేసుకొంటాను.

  కీర్తిరెడ్డి నేను స్నేహితులమే

  కీర్తిరెడ్డి నేను స్నేహితులమే

  ఇప్పటికీ నేను కీర్తీ మంచి స్నేహితులం. వాళ్ల ఫ్యామిలీ ఇప్పటికి నన్ను వారిలో కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వారి కుటుంబంలో నాకు మంచి గుర్తింపు ఉంది. కీర్తిరెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. వారిది హ్యాపీ కుటుంబం. అప్పడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుంటాం. తాతగారు చనిపోయినప్పుడు కీర్తి వచ్చి కలిసింది కూడా.

   నాగార్జున కారణం కాదు

  నాగార్జున కారణం కాదు

  కీర్తిరెడ్డి, నేను విడిపోవడానికి కారణం నాగార్జున అని అనడం సరికాదు. అది చాలా తప్పు. మా విషయంలో నాగార్జున జోక్యం వల్లనే కీర్తీ, నేను విడిపోయాం అనే మాట అవాస్తవం. కీర్తిరెడ్డి అన్నయ్యకు, నాగార్జున మంచి ఫ్రెండ్స్. వారిద్దరూ ఇప్పటికీ క్లోజ్‌గా ఉంటారు.

  English summary
  Sumanth come back to Tollywood with recent Malli Raava movie. After long gap Sumanth gained a hit in his career. Now he is happy with his venture. In this occassion, Sumanth speaks to a Youtube Channel and reveals his personal, family, filmy affairs with audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X