»   » వరుస ఫెయిల్యూర్స్ అయినా ఆగటం లేదు... ఇదిగో మళ్ళీ మొదలు

వరుస ఫెయిల్యూర్స్ అయినా ఆగటం లేదు... ఇదిగో మళ్ళీ మొదలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో బాలీవుడ్‌ సక్సెస్‌ ఫుల్‌ మూవీ 'విక్కీ డోనర్‌'ని తెలుగులో 'నరుడా డోనరుడా' పేరుతో రీమేక్‌ చేసి హీరోగా మళ్లీ తన ఉనికిని చాటుకోవాలనుకున్నాడు. కానీ నిరాశ పరిచాడు. దాంతో మళ్లీ కొంచెం గ్యాప్‌ తీసుకుని మన ముందుకు రాబోతున్నాడు. ఈ సారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుమంత్‌.

నరుడా డోనరుడా

నరుడా డోనరుడా

గత ఏడాది ‘నరుడా డోనరుడా'తో జనాల్లో కొంచెం క్యూరియాసిటీ తీసుకురాగలిగాడు కానీ.. ఆ సినిమా కూడా అతణ్ని తీవ్ర నిరాశకు గురించి చేసింది. ఈ చిత్రానికి సుమంత్ నిర్మాత కూడా. ఈ సినిమా రిజల్ట్ చూశాక సుమంత్ ఇక సినిమాలు మానేస్తాడేమో అన్న సందేహాలు కూడా కలిగాయి.

మళ్లీ సినిమా మొదలుపెట్టేశాడు

మళ్లీ సినిమా మొదలుపెట్టేశాడు

కానీ కొంచెం గ్యాప్ తర్వాత సుమంత్ మళ్లీ సినిమా మొదలుపెట్టేశాడు. గౌతమ్ తిన్ననూరి అనే కొత్త దర్శకుడితో సుమంత్ ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా కొత్తవాడే. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ అనే బేనర్ మీద రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

బద్రీనాథ్ కి దుల్హనియా

బద్రీనాథ్ కి దుల్హనియా

సుమంత్ సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించనుంది. శ్రవణ్ సంగీతాన్నందించనున్నాడు. ఈ సినిమాలో, తాజా బాలీవుడ్ హిట్ సినిమా, బద్రీనాథ్ కి దుల్హనియాలో ముఖ్య పాత్ర పోషించిన ఆకాంక్ష సింగ్ సుమంత్ తో రొమాన్స్ చేయనుంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుంది.

ఆసక్తికర స్టోరీలైన్ తో

ఆసక్తికర స్టోరీలైన్ తో

వివిధ కాలమానాల్లో ప్రేమలో పడే లీడ్ పెయిర్ పై ఒక ఆసక్తికర స్టోరీలైన్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సుమంత్ సాఫ్ట్వెర్ ప్రొఫెషనల్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి చివరి వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా మొత్తం షూటింగ్ నలభై ఐదు రోజుల షెడ్యూల్ తో పూర్తవుతుంది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ముహుర్తపు సన్నివేశం

ముహుర్తపు సన్నివేశం

ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్‌ క్లాప్‌ నివ్వగా.., నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా గారి అమ్మ గారైన సావిత్రి గారు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్‌, కాదంబరి కిరణ్‌, ప్రవీణ్‌ (వెంకట్‌) యాదవ్‌, బందరు బాబీ తదితరులు పాల్గొన్నారు.

సుమంత్ ట్రాక్ రికార్డు చూసి కూడా

సుమంత్ ట్రాక్ రికార్డు చూసి కూడా

మార్చి చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతోందీ చిత్రం. దర్శకుడే ఈ చిత్రానికి రచయిత కూడా. కథ, మాటలు, స్క్రీన్ ప్లే క్రెడిట్లు కూడా అతడివే. సుమంత్ ట్రాక్ రికార్డు చూసి అతడితో ఓ కొత్త నిర్మాత సినిమా తీయడానికి రెడీ అవడం విశేషమే. ‘నరుడా డోనరుడా' దెబ్బ నుంచి సుమంత్ కొంచెం త్వరగానే కోలుకుని తన తర్వాతి సినిమాను మొదలుపెట్టాడు. మరి ఈ చిత్రమైనా అతడి రాతను మారుస్తుందేమో చూద్దాం.

English summary
After a big Failure of Naruda Donaruda which is telugu remake of Bollywood Movie Vicky Donor, Sumanth started a new movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu