»   » నిన్న మహేష్ ..ఈ రోజు సుమంత్

నిన్న మహేష్ ..ఈ రోజు సుమంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌ జంటగా పి.రామ్మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'తను నేను' చిత్ర యూనిట్ కి నిన్న మహేష్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియచేసారు. ఈ రోజు మరో హీరో ట్విట్ ద్వారా సుమంత్‌ అభినందించారు. ఈ సినిమా ద్వారా పి.రామ్మోహన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమంత్ గతంలో నిర్మించిన 'గోల్కొండ హైస్కూల్‌' లో హీరోగా చేసారు.

'తను నేను' చిత్రంతో దర్శకుడిగా తెరకి పరిచయం అవుతున్న సందర్భంగా నటుడు సుమంత్‌ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రం ఈనెల 27న విడుదల అవుతోంది.

From the house of Ashta Chamma, Golconda High School & Uyyala Jampala, my producer/friend Ram Mohan's directorial debut, releasing this November 27th. All my very best! #ThanuNenu

Posted by Sumanth on24 November 2015

చిత్రం విశేషాల్లోకి వెళితే...

అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాల జంపాల చిత్రాల నిర్మాత రాంమోహన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'తను నేను'. సంతోష్‌, అవికాగౌర్‌ జంటగా నటిస్తుండగా దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో కన్పించనున్నారు.

అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా వంటి హిట్‌ చిత్రాల నిర్మాత పి రామ్మోహన్‌ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం 'తను నేను'. అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో 'వర్షం' చిత్ర దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.

Sumanth says wishes to Tanu nenu team

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఆ ట్రైలర్ ని మీరు మరో సారి ఇక్కడ చూడవచ్చు.

సన్ని ఎం.ఆర్‌. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్‌ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌.

English summary
Sumanth shared in FB: "From the house of Ashta Chamma, Golconda High School & Uyyala Jampala, my producer/friend Ram Mohan's directorial debut, releasing this November 27th. All my very best! ‪#‎ThanuNenu‬"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu