బట్టలిప్పేస్తానన్న హీరోయిన్‌కు కోర్టు సమన్లు
ఎస్ ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు స్పందించింది. ఉమేష్ తన కంప్లైంట్‌లో.....క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్ ముందు న్యూడ్‌గా ఫోజులు ఇస్తానని పూనమ్పాండే డిక్లేర్ చేసిందని, తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295, 295(ఎ), 504 కింద కేసులో నమోదు చేయాలని కోరారు.
ఈ ఒక్కసారే కాదు.....చాలా సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేసిన పూనమ్ పాండే మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. దీనికి తోడు తన సెక్సీ సెమీన్యూడ్ ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా విడుదల చేస్తూ మీడియా ఫోకస్ తనపైనే ఉండేలా చూసుకుంటోంది.
ఈ తరహా వ్యవహారాలతో పూనమ్ పాండేకు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగే ఏర్పడింది. ఇంకే ముందు సినిమా నిర్మాతలు ఆమెతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆమె 'నిషా' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో పూనమ్ పాండే అందాల ప్రదర్శన జోరుగా ఉంటుందని బాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications












